రాత్రి షాపు మూసేముందు బంగారం లెక్కలు చూసుకున్న యజమాని.. తేడా రావడంతో డౌట్.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2021-12-28T18:56:40+05:30 IST

అతను ఎప్పటిలాగానే రాత్రి దుకాణం మూసే ముందు నగల లెక్కలు చూసుకున్నాడు..

రాత్రి షాపు మూసేముందు బంగారం లెక్కలు చూసుకున్న యజమాని.. తేడా రావడంతో డౌట్.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే..

అతను ఎప్పటిలాగానే రాత్రి దుకాణం మూసే ముందు నగల లెక్కలు చూసుకున్నాడు.. ఎన్నిసార్లు లెక్కిస్తున్నా రెండు వస్తువులు కనిపించడం లేదు.. దీంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు.. దాంతో అసలు విషయం బయటపడింది.. ముగ్గురు అమ్మాయిలు చాలా సునాయాసంగా నగలు మాయం చేసినట్టు తేలింది.. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు సమీపంలో బర్గీ అనే పట్టణంలో కైలాష్ చంద్ జ్యూయలర్స్‌కు ఈ నెల 20న వెళ్లిన ముగ్గురు మహిళలు నగలు చూపించమని అడిగారు. చూసిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు. ఆ క్రమంలో మంగళసూత్రం, ఓ బంగారు గొలుసును కాజేశారు. ఆ విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు వారిని రెండ్రోజుల్లో పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


వారు గత కొద్ది రోజులుగా బర్గీలోని పలు నగల దుకాణాల్లో చేతివాటం చూపించినట్టు తెలుసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఆ ముగ్గురి నుంచి చిన్న సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. 

Updated Date - 2021-12-28T18:56:40+05:30 IST