multiple bank accounts: వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా?.. మరి ఈ విషయాలు మీకు తెలుసా..

ABN , First Publish Date - 2022-09-21T19:56:58+05:30 IST

మనుషులు పాకులాడుతున్న డబ్బు(money)ని బ్యాంకులు(banks) నియంత్రిస్తున్నాయి. కాబట్టే ఆర్థిక లావాదేవీలు(Financial transitions) నిర్వహించే ప్రతిఒక్కరికీ బ్యాంక్ అకౌంట్(bank account) ఉండాల్సిందే.

multiple bank accounts: వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా?.. మరి ఈ విషయాలు మీకు తెలుసా..

నుషులు పాకులాడుతున్న డబ్బు(money)ని బ్యాంకులు(banks) నియంత్రిస్తున్నాయి. కాబట్టే ఆర్థిక లావాదేవీలు(Financial transitions) నిర్వహించే ప్రతిఒక్కరికీ బ్యాంక్ అకౌంట్(bank account) ఉండాల్సిందే. డబ్బు(money)ను భద్రంగా దాచిపెట్టుకోవడంతోపాటు ప్రభుత్వ నిబంధనల పరిధిలో లావాదేవీల నిర్వహణకు బ్యాంక్ అకౌంట్లు ఎంతో ముఖ్యం. అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్ల ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించడమే లక్ష్యంగా ఆకర్షణనీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్(savings account) ఓపెనింగ్‌పై ఆకట్టుకునే ఆఫర్లు ఇస్తుంటాయి. ఈ కారణాలతోపాటు అవసరాన్ని బట్టి కొంతమంది వ్యక్తులకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వాస్తవానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండాలనే విషయంలో ఎలాంటి పరిమితులు లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండడం ప్రత్యేక అవసరాలను బట్టే మంచిదే కావొచ్చు. కానీ వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉన్నప్పుడు అవగాహన కలిగివుండాల్సిన, పాటించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.


మినిమమ్ బ్యాలెన్స్ ఉండకపోతే..

వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉంటే ఆయా అకౌంట్లలో కనీస బ్యాలెన్స్(minimum balance) నిర్వహించాలి. సర్వీసు వ్యయం, ఖాతా నిర్వహణ ఆధారంగా కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది సంబంధిత బ్యాంకులే నిర్ణయిస్తాయి. కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే సంబంధిత బ్యాంకులు జరిమానా విధించే అవకాశాలుంటాయి. ఒకటి లేదా రెండు అకౌంట్లలోనైతే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించొచ్చు. కానీ అంతకుమించి ఖాతాలను నిర్వహించడమంటే వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి కష్టమనే చెప్పాలి. కాబట్టి ఒకటికిమించి బ్యాంకు ఖాతాలు తీసుకునే ముందు అవగాహనతో వ్యవహరించడం ఎంతో ముఖ్యం.


విత్‌డ్రాయల్ విషయంలో సౌలభ్యమే..

సేవింగ్ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానమై ఉన్న డెబిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణపై రోజువారీ పరిమితి ఉంటుంది. కాబట్టి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను కలిగివుండే కస్టమర్లకు విత్‌డ్రాయల్ విషయంలో ప్రయోజనకరమే. వేర్వేరు ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరణకు అవకాశం  ఉంటుంది. వాస్తవానికి ఎన్ని సేవింగ్స్ అకౌంట్లు ఉండాలనేదానిపై ఎలాంటి పరిమితి లేకపోయినా... ఒక ఖాతాలో కొంతకాలంపాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోతే నిలిచిపోయిన ఖాతాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అకౌంట్‌లో యాక్టివిటీ లేకుండా కొనసాగిస్తే వేర్వేరు ఛార్జీలు కూడా పడే అవకాశాలుంటాయి. ఫలితంగా ఖాతాదారుడి అకౌంట్‌లోని డబ్బు తగ్గిపోతుందని గమనించాలి.


బ్యాంకు ఛార్జీలు..

సాధారణంగా బ్యాంకులు అత్యధిక సర్వీసులను ఉచితంగానే అందిస్తాయి. అయితే కొన్ని సేవలకు మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాయి. బ్యాంకులను బట్టి ఫీజులు, ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కస్టమర్లలో అత్యధికులకు ఈ ఛార్జీలపై అవగాహన ఉండదు. వాస్తవానికి ఖాతా ఓపెన్ చేసేటప్పుడు లేదా ప్రొడక్ట్ కొనుగోలు సమయంలో ఈ ఛార్జీల వివరాలను బ్యాంకులు వెల్లడిస్తాయి. కాబట్టి అప్పుడే తెలుసుకుంటే ఖాతా నిర్వహణపై సరైన అవగాహన ఉండదు. జరిమానాలు లేదా ఛార్జీలు చెల్లించకుండానే జాగ్రత్తగా వ్యవహరించేందుకు వీలుంటుంది.

Updated Date - 2022-09-21T19:56:58+05:30 IST