Abn logo
Sep 22 2021 @ 01:38AM

టీఆర్‌ఎస్‌ మండల కమిటీలు ఇవే

నిరంజనగౌడ్‌

చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 21: చౌటుప్పల్‌ మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా గిర్కాటి నిరంజనగౌడ్‌ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని ఓ ప్రైవేట్‌  గార్డెనలో టీఆర్‌ఎస్‌ మండల సమావేశం మంగళ వారం జరిగింది. రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌  చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. దండు మల్కాపురం గ్రామానికి చెందిన నిరంజన గౌడ్‌ను అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శులుగా ఢిల్లీ మాధవరెడ్డి, ఆల్మాసిపేట కృష్ణయ్య తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం గిర్కాటి నిరంజనగౌడ్‌ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన చింతల దామోదర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పిల్లలమర్రి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట: రామన్నపేట మండలంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యవర్గాన్ని  పార్టీ  మాజీ మండల అధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి అధ్యక్షతన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మందడి ఉదయ్‌రెడ్డి, కార్యదర్శిగా పోషబోయిన మల్లేష్‌యాదవ్‌, ఉపాధ్యక్షులుగా కోళ్ల స్వామి, ఎండీ అస్లాంబేగ్‌,  వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులుగా ఆవుల నరేందర్‌, కంచి నర్సింహ, మేడబోయిన ధనుంజయ, అధికార ప్రతినిధిగా ఎండీ .నాసర్‌లను ఎన్నుకున్నారు.  టీఆర్‌ఎస్‌ అనుబంధ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన బలరాంయాదవ్‌, పున్న జగన్మోహన, బొక్క మాధవరెడ్డి, గోదాసు పృథ్వీరాజ్‌, ు పాల్గొన్నారు. 

సీపీఎం మండల కార్యదర్శిగా బొడ్డుపల్లి వెంకటేశం

రామన్నపేట: రామన్నపేటలో నిర్వహించిన సీపీఎం మండల మహాసభలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులుగా జెల్లెల పెంటయ్య, కూరెళ్ల నర్సింహాచారి, జంపాల ఆండా లు, బోయిని ఆనంద్‌, యాదాసు యాదయ్య, మీర్‌ ఖాజావలీ, బల్గూరి అంజయ్య, గాదె నరేందర్‌, మండల కమిటీ సభ్యులుగా మామిడి వెంకట్‌రెడ్డి, కల్లూరి నగేష్‌, కందుల హనుమంతు, బావండ్లపలి ్ల బాలరాజు, వనం ఉపేందర్‌, నాగటి ఉపేందర్‌, గన్నె బోయిన విజయభాస్కర్‌, ఎర్ర సుమలత, గోగు మహేశ్వరి,  ఎండీ.రషీద్‌, వేములు సైదులు, మేడి గణేష్‌లను ఎన్నుకున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా శ్రీను

సంస్థాన నారాయణపురం, సెప్టెంబరు 21:  కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా డాకుతండాకు చెందిన కరంటోతు శ్రీనును మంగళవారం ఎన్నుకున్నారు.  ఈ మేరకు  శ్రీనుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియామకపత్రం అందజేశారు. పార్టీ జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా  మందుగుల బాలకృష్ణ, కార్యదర్శులుగా గుత్త శ్రీధర్‌రెడ్డి, శివరాత్రి సాగర్‌లను నియమించారు.