Eye problems in children : పిల్లల్లో కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు..ఇవే..

ABN , First Publish Date - 2022-09-13T17:31:14+05:30 IST

రెండు సంవత్సరాలుగా పిల్లలకు ఆన్లైన్ క్లాసులతో కంటి అద్దాలు కూడా కామన్ అయిపోయాయి.

Eye problems in children : పిల్లల్లో కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు..ఇవే..

ఈ మధ్య కాలంలో పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా తరువాత ఆన్లైన్ క్లాసులంటూ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు పడటం వాటితోనే గంటలతరబడి ఉండాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం. దీనితో కళ్లు ఎర్ర బడటం, చూపు మందగించడం, చిన్నవయసులోనే కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మందులతో కాకుండా ఈ కంటి సమస్యలను ఆహారంతో ఎంతవరకూ నివారించవచ్చు అనేది తెలుసుకుందాం.


రెండు సంవత్సరాలుగా పిల్లలకు ఆన్లైన్ క్లాసులతో కంటి అద్దాలు కూడా కామన్ అయిపోయాయి. అసలు కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. 


క్యారెట్: 

క్యారెట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి, కె, సి6 కూడా ఉన్నాయి. అదనంగా ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి. 


బత్తాయి, కమలా:

విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి, కమలా పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. రోజులో పిల్లలు ఒక పండు చప్పున తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవు.


ఉసిరి:

విటమిన్ సి సమృద్ధిగా ఉన్న మరో పదార్థం ఉసిరి. దీనిని రోజుకు ఒకటి చప్పున తీసుకుంటే పిల్లలు, పెద్దలలో కంటి సమస్యలు, జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుంది.


బచ్చలి కూర:

చలికాలంలో అధికంగా లభించే బచ్చలి కూరలో ఫోలిక్ యాసిడ్ కంటి నాడిని మెరుగుగా ఉంచుతుంది. పలుచని పప్పులో బచ్చలికూర వేసి వండితే పిల్లలు ఇష్టంగా తింటారు. 


స్వీట్ పొటాటో: 

బీటా కెరోటిన్, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. బీటా కెరోటిన్ కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ బి6 ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

Updated Date - 2022-09-13T17:31:14+05:30 IST