whatsapp block: వాట్సప్‌లో మీ నంబర్‌ని బ్లాక్ చేశారని ఏమైనా డౌట్ ఉందా?.. ఈ 5 టిప్స్‌తో ఈజీగా తెలుసుకోండి

ABN , First Publish Date - 2022-09-21T23:12:47+05:30 IST

యూజర్ల అనుభూతిని పెంపొందించడమే లక్ష్యంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ (whatsapp) ఎప్పటికప్పుడు నూతన అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

whatsapp block: వాట్సప్‌లో మీ నంబర్‌ని బ్లాక్ చేశారని ఏమైనా డౌట్ ఉందా?.. ఈ 5 టిప్స్‌తో ఈజీగా తెలుసుకోండి

యూజర్ల అనుభూతిని పెంపొందించడమే లక్ష్యంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ (whatsapp) ఎప్పటికప్పుడు నూతన అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల గోప్యత(privacy) విషయంలో నూతన అప్‌డేట్‌లను అందిస్తోంది. అలాంటి ఫీచర్లలో బ్లాక్(block) ఆప్షన్ ఒకటి. పలానా వ్యక్తి మీకు మెసేజులు పంపించకుండా లేదా మీరు ఆ వ్యక్తికి మెసేజీలు పంపకుండా ఏ వాట్సప్  నంబర్‌నైనా బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేస్తే అవతలి వ్యక్తులు తమ స్టేటస్ అప్‌డేట్స్, ఆన్‌లైన్ స్టేటస్, కనీసం ప్రొఫైల్ పిక్ కూడా చూడడం కుదరదు. బ్లాక్ చేయాలనుకుంటే ఏ కాంటాక్ట్‌నైనా సులభంగానే బ్లాక్ చేయవచ్చు. కాంటాక్ట్ ఓపెన్ చేసిన పైన కుడి పక్కన ఉండే మూడు చుక్కలపై ట్యాప్ చేస్తే.. రెండవ ఆప్షనే ‘బ్లాక్’ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. 


అయితే మీ ఫ్రెండ్, కుటుంబ సభ్యుడు లేదా మీపై కోపమున్న ఇంకెవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారనే అనుమానం వస్తే తెలుసుకోవడం ఎలా?. అనే సందేహం ఉందా?. అందుకోసం 5 సులభమైన టిప్స్ ఉన్నాయి. ఆ మార్గాలేంటో మీరూ చూసేయండి..


లాస్ట్ సీన్ చెక్ చేయండి: మిమ్మల్ని బ్లాక్ చేశారని సందేహం కలిగిన కాంటాక్ట్ ఆన్‌లైన్ స్టేటస్ లేదా లాస్ట్ సీన్ కనిపించకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు భావించొచ్చు. అయితే త్వరలోనే యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్‌ని హైడ్ చేయాలని వాట్సప్ భావిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ విధానంలో చెక్ చేయడం సాధ్యపడకపోవచ్చు.


ప్రొఫైల్ పిక్, స్టేటస్ చూడండి: మీరు పరిశీలించాలనుకుంటున్న కాంటాక్ట్ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్ కనిపించకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు సందేహించవచ్చు. అయితే వాట్సప్‌పై  ప్రొఫైల్ ఫొటోని ఎంపిక చేసిన వ్యక్తులకే కనిపించేలా ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది. స్టేటస్ విషయంలోనూ ఇదే ఆప్షన్ ఉంటుంది. అయినప్పటికీ బ్లాక్ చేసినవారిని చెక్ చేసేందుకు మరో 3 మార్గాలున్నాయి.


మెసేజ్ పంపించండి: మీరు చెక్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్‌కి మెసేజ్ పంపించే ప్రయత్నం చేయండి. మెసేజ్ డెలివరీ అయినట్టు డబులు టిక్ కనిపించకపోతే అనుమానించాల్సిందే. కొన్ని గంటలు గడిచినా మెసేజీ డెలివరీ కాకుంటే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు భావించవొచ్చు.


కాంటాక్ట్‌కి కాల్ చేయండి: కాంటాక్ట్‌కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. కాలింగ్ స్టేటస్ ‘రింగింగ్’(Ringing)కి మారలేదంటే మీ కాంటాక్ట్‌ని బ్లాక్ చేసినట్టే.


వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయండి: మీకు సందేహం కలిగిన నంబర్‌ని కలుపుకుని వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ వ్యక్తి కనుక మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే గ్రూప్ యాడ్ చేయడం వీలుపడదు. ఇలా ఐదు మార్గాల ద్వారా వాట్సప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తుల్ని సులభంగా గుర్తించవచ్చు.

Updated Date - 2022-09-21T23:12:47+05:30 IST