కరోనా కారణంగా గత ఏడాది ఏడెనిమిది నెలలు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను అలరించడానికి తెలుగు, హిందీ సహా సౌత్‌లోని అన్నీ భాషల చిత్రాలు ప్రముఖ ఓటీటీలలో విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఒకరకంగా చిత్రపరిశ్రమలోని నిర్మాతలకు ఓటీటీల ద్వారా కాస్త ఊరట లభించిందని చెప్పాలి. అందుకే, థియేటర్స్ రిలీజ్ కాకుండా కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. చాలావరకు ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలకు మంచి ఆదరణ కూడా దక్కుతోంది. ఈ క్రమంలో ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి.
ఆ చిత్రాలు ఇవే..
1) ది లాస్ట్ డాటర్- డిసెంబరు 31న విడుదల
2) టైమ్ ఈజ్ అప్ – డిసెంబరు 31న అమెజాన్‌లో లోవిడుదల
3) చోటా బీమ్: ఎస్14 – డిసెంబరు 1న విడల
4) ది పొస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్ – డిసెంబరు 27 విడుదల
5. సేనాపతి – డిసెంబర్ 31న ఆహాలో ప్రసారం
6) కోబ్రా కాయ్(సీజన్-4) – డిసెంబరు 31న విడుదల
6. లేడీ ఆఫ్ మేనర్ – డిసెంబరు 31న అమెజాన్‌లో ప్రసారం