Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ షురూ.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... కొనాలనుకుంటే ఇదే సరైన సమయం..

ABN , First Publish Date - 2022-09-23T04:02:05+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ - కామర్స్(E-commerce) సంస్థల ఫెస్టివల్ సేల్స్‌ వచ్చేశాయి.

Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ షురూ.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... కొనాలనుకుంటే ఇదే సరైన సమయం..

న్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ - కామర్స్(E-commerce) సంస్థల ఫెస్టివల్ సేల్స్‌ సీజన్ వచ్చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభం కావాల్సిన ఫ్లిప్‌కార్ట్(flipkart) ‘బిగ్ బిలియన్ డేస్ సేల్ -2022’ (big billion days sale), అమెజాన్(amazon) ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022’ (great indian festival sale).. ప్రైమరీ, ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందు గురువారమే అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు చేజిక్కించుకునే అవకాశం ఉండడంతో ఈ ఫెస్టివల్ సేల్స్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సెల్‌ఫోన్ కొనాలనుకునేవారు ఫెస్టివల్ సేల్స్ కోసం వేచిచూస్తుంటారు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌(flipkart) బిగ్‌బిలియన్ డేస్ సేల్ ఆరంభమవడంతో ఆ ప్లా‌ట్‌ఫామ్‌పై రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల ఏవీ, వాటి వివరాలను తెలుసుకుందాం. ఎందుకంటే భారీ డిస్కౌంట్లు లభిస్తుండడంతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇదే చక్కటి అవకాశం..


కాగా ప్రీపేయిడ్ ఆర్డర్స్, బ్యాంక్ కార్డ్స్‌తోపాటు ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్లు ఆధారంగా ఈ రేట్లు అందుబాటులో ఉన్నాయని పాఠకులు గుర్తించాలి. ఈ జాబితాలో షియోమీ 11ఐ హైపర్‌ఛార్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ  ఎఫ్23, సహా ఇతర ఉన్నాయి. అవేంటో మీరూ చూసేయండి..


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..


- ‘షియోమీ 11ఐ హైపర్‌ఛార్జ్’ ఫోన్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ.24,999గా ఉంది. అయితే బిగ్‌బిలియన్ డేస్‌లో ఈ ఫోన్ రూ.19,999కే లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం (రూ.1500) వరకు డిస్కౌంట్, ప్రీపేయిడ్ ఆర్డర్లపై అదనంగా మరో రూ.3500 డిస్కౌంట్‌తో కలిపి రూ.19,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


- రియల్‌మీ 9 ప్రో+ అసలు ధర రూ.24,999 కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.22,999కి తగ్గింది. అంటే రూ.2000 డిస్కౌంట్ లభిస్తోంది. ప్రీపేయిడ్ డిస్కౌంట్ ఆఫర్ రూ.3000 తోపాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 10 శాతం(రూ.1500) డిస్కౌంట్‌తో రూ.18,499కే రియల్‌మీ 9 ప్రో(6జీబీ+128జీబీ) దక్కించుకునే అవకాశం ఉంది.


-  ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్23’ ఫోన్ 4జీ+128జీబీ మోడల్ ధర రూ.12,499 లకే లభిస్తోంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొంది రూ.10,999కే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


- మోటో జీ52 (Moto G52) ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారు రూ.11,699కే ఈ ఫోన్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. 


- రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ‘ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్‌డేస్’లో ఆరంభ ధర రూ.17,999గా ఉంది. అయితే ఐసీఐసీఐ/యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1500, ప్రీపేయిడ్ ఆర్డర్లపై రూ.1500 వరకు డిస్కౌంట్‌తో రూ.14,999కే ఫోన్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2022-09-23T04:02:05+05:30 IST