bank holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. పండుగలతోపాటు 5 ఆదివారాలు.. మొత్తం హాలిడేస్ ఎన్నో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-24T00:50:11+05:30 IST

ఆర్థిక కార్యకలాపాల్లో బ్యాంకుల(banks) పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉన్నా కొన్ని లావాలాదేవీలను తప్పనిసరిగా బ్యాంకుల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది.

bank holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. పండుగలతోపాటు 5 ఆదివారాలు.. మొత్తం హాలిడేస్ ఎన్నో తెలుసా..

న్యూఢిల్లీ : ఆర్థిక కార్యకలాపాల్లో బ్యాంకుల(banks) పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉన్నా కొన్ని లావాలాదేవీలను తప్పనిసరిగా బ్యాంకుల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే రెగ్యులర్ బ్యాంక్ కస్టమర్లు సెలవు దినాలకు అనుగుణంగా తమ పనులను  చక్కబెట్టుకుంటుంటారు. అలా రెగ్యులర్‌గా బ్యాంక్ కార్యకలాపాలపై ఆధారపడే కస్టమర్లు అక్టోబర్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే.. దసరా, దీపావళి పండుగలతోపాటు ఇతర సెలవులు, వారాంతాల్లో బ్యాంకుల క్లోజింగ్స్‌తో కలుపుకుని అక్టోబర్ హాలిడేస్(bank holidays) సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. సజావుగా  బ్యాంకు లావాదేవీలు పూర్తి చేయాలనుకునేవారు ముందుగానే హాలిడేస్‌(bank holidays) గురించి తెలుసుకుంటే తమ కార్యకలాపాలు చక్కదిద్దుకోవచ్చు. 


గైడ్‌లైన్స్ ప్రకారం ఆర్బీఐ(RBI) బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌లో మొదటి బ్యాంక్ సెలవు అక్టోబర్ 2న గాంధీ జయంతితో మొదలవుతుంది. ఆ తర్వాత దుర్గపూజ, దసరాతోపాటు దీపావళి పండుగలతోపాటు అక్టోబర్‌లో మొత్తం 5 ఆదివారాలు వచ్చాయి. దీంతో అక్టోబర్‌లో బ్యాంక్ సెలవుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో 10గా ఉంది. అయితే 2 సెలవు రోజులు ఆదివారం రావడంతో సరిపోయింది. లేదంటే హాలిడేస్ లెక్క 12కి చేరివుండేది. మరి అక్టోబర్‌లో ఏయే రోజుల్లో ఎన్ని సెలవులు వచ్చాయో మీరూ ఓ లుక్కేయండి..


అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో..

అక్టోబర్ 2 - గాంధీజయంతి(ఆదివారం)

అక్టోబర్ 3 - మహా అష్టమి

అక్టోబర్ 5 - విజయదశమి లేదా దసరా

అక్టోబర్ 8 - రెండవ శనివారం

అక్టోబర్ 9 - ఈద్ ఈ మిలాద్(ఆదివారం)

అక్టోబర్ 22 - నాలుగవ శనివారం బ్యాంక్ హాలిడే

అక్టోబర్ 24 - దీపావళి

ఆదివారాలతో కలిపి మొత్తం 10 రోజులు బ్యాంకు సెలువులు ఉన్నాయి.


తెలంగాణలో..

అక్టోబర్ 2 - గాంధీ జయంతి(ఆదివారం)

అక్టోబర్ 3 - మహాఅష్టమి

అక్టోబర్ 5 - విజయదశమి

అక్టోబర్ 8 - రెండవ శనివారం

అక్టోబర్ 9 - ఈద్ ఈ మిలాద్(ఆదివారం).

అక్టోబర్ 22 - నాలుగవ శనివారం బ్యాంక్ హాలిడే

అక్టోబర్ 24 - దీపావళి

ఆదివారాలతో కలిపి మొత్తం 10 రోజులు బ్యాంకు సెలువులు ఉన్నాయి.


ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో 21 రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఆ జాబితా ఇదే..

అక్టోబర్ 1 - బ్యాంక్ అకౌంట్ల హాఫ్ ఇయర్లీ క్లోజింగ్.

అక్టోబర్ 2 - ఆదివారం, గాంధీ జయంతి హాలిడే

అక్టోబర్ 3 - దుర్గాపూజ(మహాఅష్టమి)

అక్టోబర్ 4 - దుర్గాపూజ(మహానవమి)

అక్టోబర్ 5 - దుర్గాపూజ(విజయదశమి)

అక్టోబర్ 6 - దుర్గాపూజ(దషైన్)

అక్టోబర్ 7 - దుర్గాపూజ(దషైన్)

అక్టోబర్ 8 - సెకండ శనివారం

అక్టోబర్ 9 - ఆదివారం

అక్టోబర్ 13- కర్వా చౌత్

అక్టోబర్ 14 - ఈద్ ఈ మిలాద్ ఉన్ నబీ

అక్టోబర్ 16 - ఆదివారం

అక్టోబర్ 18 - కటి బిహు

అక్టోబర్ 22 - నాలుగవ శనివారం

అక్టోబర్ 23 - ఆదివారం

అక్టోబర్ 24 - కాళీ పూజ(దీపావళి)

అక్టోబర్ 25 - లక్ష్మీపూజ

అక్టోబర్ 26 - గోవర్ధన్ పూజ్/విక్రమ్ సంవంత్ న్యూఇయర్ డే

అక్టోబర్ 27 - భైదూజ్

అక్టోబర్ 30 - ఆదివారం

అక్టోబర్ - 31 సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం

Updated Date - 2022-09-24T00:50:11+05:30 IST