ఇవి షుగర్‌ ఫ్లవర్స్‌!

ABN , First Publish Date - 2021-04-10T05:30:00+05:30 IST

పై చిత్రంలో పువ్వు చాలా బాగుంది కదూ! అది చూడటానికి ఎంత బాగుందో, రుచిలో కూడా అంతే బాగుంటుంది. అదేంటి? పువ్వును ఎలా తింటారని అంటారా? అది నిజమైన పువ్వు కాదు. ఒక ఆర్టిస్టు చేతిలో తయారైన షుగర్‌ ఫ్లవర్‌. ఆ విశేషాలు ఇవి...

  • ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన మిచెల్‌ నుయెన్‌కు షుగర్‌ ఫ్లవర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు ఉంది. ఆయన చేతిలో తయారైన  ఫ్లవర్స్‌ను చూస్తే ఏది నిజమైన పువ్వో, ఏది షుగర్‌ ఫ్లవరో గుర్తు పట్టలేరు. అంతచక్కగా ఫ్లవర్స్‌ను తయారుచేస్తాడు. షుగర్‌ ఫ్లవర్స్‌ తయారుచేయడంలో మిచెల్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. 
  • చెట్ల ఆకుల నుంచి పూల రేకుల వరకు ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా షుగర్‌ ఫ్లవర్స్‌ తయారుచేస్తాడు. అదెలా సాధ్యమవుతోందని అడిగితే నిజమైన పూలను చూసి స్ఫూర్తిని పొందుతానని అంటారు.
  • ప్రస్తుతం మిచెల్‌ తనలో ఉన్న టాలెంట్‌ను విద్యార్థులకు నేర్పే పనిలో ఉన్నాడు. షుగర్‌ ఫ్లవర్స్‌ ఎలా తయారుచేయాలో నేర్పిస్తున్నాడు. షుగర్‌ పేస్టు ఎలా తయారుచేయాలి? పర్‌ఫెక్ట్‌ రంగు వచ్చేందుకు పాటించాల్సిన మెలకువలు చెబుతున్నాడు. బెస్ట్‌ ఆస్ట్రేలియన్‌ షుగర్‌ ఫ్లోరిస్ట్‌ అవార్డును అందుకున్నారు మిచెల్‌.

Updated Date - 2021-04-10T05:30:00+05:30 IST