Abn logo
Oct 2 2020 @ 01:28AM

వాస్తవాలకు అద్దం పట్టే చిత్రాలివి!

Kaakateeya

ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లో మంగళవారం జరిగిన రేప్‌ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు నిర్భయ.. ఆ తర్వాత దిశ సంఘటనలు కూడా ఈ తరహాలో సంచలనం సృష్టించినవే! వీటిని స్ఫూర్తిగా తీసుకొని అనేక చలన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. సమాజంలో జరిగే సంఘటనలు సినీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనటానికి ఈ చిత్రాలే ఉదాహరణ. కేవలం కమర్షియల్‌ కథలే కాకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ తీసిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 


నేటితరం ప్రేక్షకులు వాస్తవ గాథలను కూడా ఇష్టపడుతున్నారు. వాస్తవిక కోణానికి కొంత కల్పిత అంశాలను జోడించి నిర్మిస్తున్న చిత్రాలకు కూడా మంచి ఆదరణే లభిస్తోంది. సాధారణంగా యథార్థ సంఘటనలను ప్రేక్షకులు టీవీ తెరలపై చూసేసి ఉంటారు. కానీ వాటి వెనుకున్న అంశాలను తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. దర్శకులు వాటిని హృద్యంగా మలచినప్పుడు వాటికి ఆదరణ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సంఘటనలు నేర్పిన గుణపాఠాన్ని తెలుసుకోవటానికి ప్రేక్షకులు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు 2012లో ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ హత్యాచారం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. నిందితులకు శిక్ష పడే వరకూ ప్రజలందరూ ఆ ఘటన గురించి మాట్లాడుకున్నారు. ఈ ఉదంతం ఆధారంగా పలు భాషలో సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కాయి.


బెంగాలీలో ‘నిర్భోయ’, హిందీలో ‘ఇండియన్‌ నెవర్‌ ఎగైన్‌ నిర్భయ’ చిత్రాలొచ్చాయి. అంతే కాదు విదేశాల్లో కూడా నిర్భయ ఘటనను సినిమాగా తీశారు. ‘అనాటమీ ఆఫ్‌ వయలెన్స్‌’ పేరుతో కెనడాలో దీపా మెహతా ఓ సినిమా తెరకెక్కించారు. ‘ఇండియాస్‌ డాటర్‌’ పేరుతో యు.కెకి చెందిన లెస్లీ ఉద్విన్‌ డాక్యుమెంటరీ తీశారు. ఇదే కథాంశంతో తెరకెక్కిన ‘ఢిల్లీ క్రైమ్‌’ వెబ్‌సిరీస్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. ఓ మారుమూల గ్రామంలో దళిత మహిళపై జరిగిన హత్యాచారం నేపథ్యంలో అనుభవ్‌ సిన్హా తెరకెక్కించిన ‘ఆర్టికల్‌ 15’ కూడా ఈ తరహా కథల్ని గుర్తు చేస్తుంది. ఇక తన బిడ్డను కిడ్నాప్‌ చేసి, హత్యాచారం చేసిన యువతపై ఓ తల్లి ఎలా రివేంజ్‌ తీసుకందనే కథాంశంతో శ్రీదేవి ‘మామ్‌’, రవీనా టాండన్‌ ‘మాతృ’ సినిమాలొచ్చాయి. ‘కాబిల్‌’, భూమి’ చిత్రాలు కూడా ఈ తరహా కథాంశాలే. వీటన్నింటికి యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారం. ఇక గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్యాచారం కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ సంఘటన జరిగి ఏడాదైన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజా హాత్రస్‌ సంఘటనపై కూడా అనేక చిత్రాలు వస్తాయనటంలో సందేహం లేదు. 

Advertisement
Advertisement
Advertisement