ఈ ఏటి మేటి డౌన్‌లోడింగ్‌ యాప్స్‌

ABN , First Publish Date - 2021-07-03T05:41:05+05:30 IST

కొవిడ్‌ పుణ్యమా అని డిజిటల్‌ వినియోగం పెరిగింది. తమకు ఇష్టమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరాలు

ఈ ఏటి మేటి డౌన్‌లోడింగ్‌ యాప్స్‌

కొవిడ్‌ పుణ్యమా అని డిజిటల్‌ వినియోగం పెరిగింది. తమకు ఇష్టమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరాలు లేదంటే ఆనందం పొందుతుండటం ఇవాల్టి విశేషం. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి గడిచిన ఆరు నెలల్లో  కింది యాప్‌లు ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయినట్టు ‘సెన్సర్‌ టవర్‌’ వెల్లడించింది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌లో కొన్ని వీటిలో కామన్‌ కాగా, ఇంకొన్ని ఒక ప్లాట్‌ఫాంలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయినట్టు తేలింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలను లెక్కల్లోకి తీసుకుని లెక్క తేల్చారు.




టిక్‌టాక్‌

రెండు ప్లే స్టోర్‌ల నుంచి ఎక్కువగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌ ఇది. డౌన్‌లోడ్‌ విషయంలో ఐఓఎస్‌ వినియోగదారులు మొదటి స్థానంలో ఉన్నారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు రెండో ప్లేస్‌లో ఉన్నారు.




ఫేస్‌బుక్‌

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ జైయింట్‌గా ఫేస్‌బుక్‌ ప్రైమరీ యాప్‌గా గూగుల్‌ ప్లే స్టోర్‌లో మొదటిదిగా ఉంది. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఆరో స్థానంలో ఉంది.




వాట్సాప్‌

రెంటిలోనూ ఈ ఇన్‌స్టాంట్‌ మెస్సేజింగ్‌ యాప్‌ నాలుగో స్థానంలో ఉంది.






ఫేస్‌బుక్‌ మెసెంజర్‌

యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో 7, గూగుల్‌ ప్లే స్టోర్‌లో 6 స్థానాల్లో ఉన్నాయి. 




ఇన్‌స్టాగ్రామ్‌

ఫొటో షేరింగ్‌ యాప్‌గా ఇది రెంటిలోనూ మూడో నంబర్‌లో ఉంది. 




జూమ్‌

పాపులర్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌గా ఇది. యాపిల్‌ యాప్‌లో 5, గూగుల్‌ ప్లే స్టోర్‌లో 8 స్థానాల్లో ఉంది. 



యూట్యూబ్‌

గూగుల్‌కు చెందిన ఈ యాప్‌ రెండో స్థానంలో ఉంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాత్రం మొదటి పదింటిలో దీనికి స్థానం దక్కలేదు.





ఎంఎక్స్‌ టకాటాక్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాత్రమే పదో ప్లేస్‌లో ఉంది.




క్యాప్‌కట్‌ 

యాపిల్‌ స్టోర్‌లో మాత్రమే ఎనిమిదో ప్లేస్‌లో ఉంది.




జీమెయిల్‌

గూగుల్‌ ఈమెయిల్‌ సర్వీస్‌గా ఇది యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో 10 ర్యాంక్‌ పొందింది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాత్రం మొదటి పదింటిలో స్థానం పొందలేదు.




గూగుల్‌ మ్యాప్స్‌

యాప్‌ స్టోర్‌లో దీనికి పదో స్థానం దక్కింది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాత్రం మిస్‌ అయింది.




స్నాప్‌చాట్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న దీనికి యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మొదటి పదింటిలో స్థానం దక్కలేదు. 




గూగుల్‌ మీట్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌లో 9వ ర్యాంక్‌. యాపిల్‌ యాపిల్‌ స్టోర్‌లో స్థానం లేదు.




టెలిగ్రామ్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. యాపిల్‌ స్టోర్‌లో స్థానం లేదు.




Updated Date - 2021-07-03T05:41:05+05:30 IST