మన ఇంటిలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని తీవ్రంగా కలవరపరుస్తుంటాయి. అయితే వాటికి కారణాలు మనకు అంతుపట్టవు. ఇలాంటివి పదే పదే జరుగుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇవి మన ఇంటిలో తలెత్తబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతాలు కావచ్చు. ఆచార్య చాణక్య మన ఇంటిలో తలెత్తబోయే 5 ఆర్థిక సంక్షోభ సంకేతాల గురించి తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తులసి చెట్టు ఎండిపోవడం
ఇంటిలోని తులసి చెట్టు ఆకస్మికంగా ఎండిపోవడం. ఇలా పలుమార్లు జరగడం రాబోయే ఆర్థిక సమస్యలకు సంకేతం. అటువంటప్పుడు ఇంటిలో జరుగుతున్న పొరపాట్లపై దృష్టి సారించి, చక్కదిద్దుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.
2. గాజు పగలడం
ఎటువంటి కారణం లేకుండా గాజు పదేపదే పగిలిపోతే, అది ఇంటిలో తలెత్తబోయే ఆర్థిక సమస్యలకు సంకేతం కావచ్చు. ఇంట్లో పగిలిన గాజును ఉంచవద్దు. వెంటనే దానిని బయట పారవేయండి.
3. తరచూ గొడవలు జరుగుతుండటం
అలాగే ఇంటిలో తరచూ గొడవలు జరుగుతుంటే, దీని గురించి చుట్టుపక్కలవారు చర్చించుకుంటుంటే, వెంటనే మీ ఇంటి వాతావరణాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. ఇలా తరచూ గొడవలు పడే ఇంటిలోని వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని, డబ్బుకు ఇబ్బందులు తలెత్తుతుంటాయని ఆచార్య చాణక్య తెలిపారు.
4. పెద్దలను అవమానించడం
పెద్దలను అవమానించే ఇంట్లో కూడా డబ్బుకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇంటిలోని వృద్ధులను అవమానిస్తే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే ఇంటిలో ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.
5. దైవారాధన చేయకపోవడం
దైవారాధన, పూజలు చేయని ఇంటిలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అలాంటి ఇంటిపై దైవానుగ్రహం ఉండదని, పేదరికం తాండవిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.
ఇవి కూడా చదవండి