ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

ABN , First Publish Date - 2022-02-25T21:32:15+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కరోనా ఆంక్షలను సవరించారు. కొద్ది రోజులుగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు.

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కరోనా ఆంక్షలను సవరించారు. కొద్ది రోజులుగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో, శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మాస్క్ ధరించకపోతే ఐదు వందల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఈ జరిమానా రెండు వేల రూపాయలుగా ఉండేది. ఢిల్లీ పరిధిలోని పాఠశాలల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులే జరుగుతుండగా, వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిస్థాయి ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకు సూచించారు. మరోవైపు ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వాటిని సడలించారు.

Updated Date - 2022-02-25T21:32:15+05:30 IST