ఆడ ఉంటా.. ఈడ ఉంటా!

ABN , First Publish Date - 2022-09-27T06:22:12+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో ఓ ఉద్యో గి పెత్తనం రోజు రోజుకూ ఎక్కువవుతోం ది. సూర్యాపేట జిల్లాలోని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ, నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెత్తనం చేస్తూ, యాదాద్రి జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చెందిన వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకుం టూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి.

ఆడ ఉంటా.. ఈడ ఉంటా!

సూర్యాపేట జిల్లాలో ఉద్యోగం, నల్లగొండలో పెత్తనం 

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఓ ఉద్యోగి ఇష్టారాజ్యం


నల్లగొండ: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో ఓ ఉద్యో గి పెత్తనం రోజు రోజుకూ ఎక్కువవుతోం ది. సూర్యాపేట జిల్లాలోని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ, నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెత్తనం చేస్తూ, యాదాద్రి జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చెందిన వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకుం టూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. పై అధికారులకు ఏ మాత్రం సంబంధం లేకుండా సొంతం గా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అతడి పెత్తనంపై ప్రశ్నిస్తే తన వెనుక బలమైన శక్తులు ఉన్నాయని, తన తో పెట్టుకుంటే ఇబ్బందులొస్తాయని బెదిరించినట్టు పలువురు ఉద్యోగులు తెలిపారు.


ఉమ్మడి జిల్లా విభజన అనంతరం ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ 317 ప్రకారం కేటాయించిన జిల్లాలో మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి ఓ అధికారితో సఖ్యతగా మెలిగి ఎటువంటి డిప్యుటేషన్‌ లేకుండా నల్లగొండ కార్యాలయంలో పనులు చక్కబెట్టడం గమనార్హం. ఇటీవల సూర్యాపేట జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన సొసైటీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వివాదాస్పదంగా ఉన్నా, ఏకపక్షంగా వ్యవహరించి నిబంధనకు విరుద్ధంగా రెన్యువల్‌ చేసినట్టు తెలిసింది. ఈ విషయం వివాదాస్పదం కాగా, తాము చేసేది చేస్తాం కోర్టుకు వెళ్లండని కరాఖండిగా చెప్పి సొసైటీని రెన్యువల్‌ చేశారు. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు గుసగుసలు వినవస్తున్నాయి.


ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్‌

సదరు ఉద్యోగికి వ్యవహార శైలిని నల్లగొండ కార్యాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సూర్యాపేట నుంచి వారానికి రెండు, మూడుసార్లు నల్లగొండ కార్యాలయానికి వచ్చి ఫైళ్లను చక్కబెట్టడాన్ని ఇక్కడి ఉద్యోగు లు తప్పుపడుతున్నారు. అతడి వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు ఉద్యోగులు సన్నద్ధమయ్యారు. మరొకసారి ఇలాగే వ్యవహరిస్తే జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సొసైటీ రిజిస్ట్రేషన్లతో పాటు స్టాంపు వెండర్ల విషయంలో సైతం జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కార్యాలయంలో అర్హులైన ఉద్యోగులు ఆయా సెక్షన్లలో ఉన్నా, సూర్యాపేట నుంచి ఇక్కడి రావడమేంటని, అతడికి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని స్థానిక ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


అన్ని సెక్షన్లలో జోక్యం

అన్ని సెక్షన్లలో సదరు ఉద్యోగి జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నల్లగొండ కార్యాలయానికి వచ్చి సంబంధం లేని సెక్షన్‌ సీటులో కూర్చొని హడావుడి చేయడమేగాక ఇతర ఉద్యోగులను తన పనికి పురమాయించడాన్ని స్థానిక ఉద్యోగులు తప్పుబడుతున్నా రు. ఎప్పుడో బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఇక్కడికి వచ్చి సంబంధం లేని సొసైటీ విషయాల్లో తల దూర్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని ఓ సొసైటీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.2.50లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు.


నా ప్రమేయం లేదు : సురేష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌

గతంలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసినందున జిల్లా రిజిస్ట్రార్‌ కోరిక మేరకు ఇక్కడి వచ్చి సహకరించా. అంతకు మించి నా ప్రమేయం లేదు. కేవలం ఫైల్‌ను పరిశీలించి జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేశా. ఒక ఇంజనీరింగ్‌ కళాశాల ఫైల్‌ తయారీకి మాత్రమే సహకరించా తప్ప ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు.


Updated Date - 2022-09-27T06:22:12+05:30 IST