అక్కడ... వారానికి నాలుగు రోజులే ‘పని’... వెళదామా ?

ABN , First Publish Date - 2021-11-29T23:16:07+05:30 IST

వారానికి నాలుగు రోజులే పని ! ఇదేదో బాగున్నట్లే ఉందే. ఇప్పటివరకు వారానికి ఐదు రోజు రోజుల పని విధానం గురించి మాత్రమే విన్నాం కదా. కానీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏమిటంటారా ? కరోనా నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న మార్పులివి.

అక్కడ... వారానికి నాలుగు రోజులే ‘పని’... వెళదామా ?

లండన్ : వారానికి నాలుగు రోజులే పని ! ఇదేదో బాగున్నట్లే ఉందే. ఇప్పటివరకు వారానికి ఐదు రోజు రోజుల పని విధానం గురించి మాత్రమే విన్నాం కదా. కానీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏమిటంటారా ? కరోనా నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న మార్పులివి. సరే... ఇక విషయానికొస్తే... బ్రిటన్ కు చెందిన ఓ బ్యాంక్ సీఈఓ... ఇలా అనడమే కాకుండా, వారానికి నాలుగు రోజులు పనిచేస్తే చాలని, అది కూడా కార్యాలయానికి రాకపోయినా ఫర్వాలేదు., ఇంటినుంచైనా పనిచేయొచ్చని కూడా చెబుతున్నారు. అంతేకాదు... వేతనంలో ‘కోత’లు వంటివేమీ ఉండబోవని కూడా భరోసా ఇస్తున్నారు. ‘ఇదేదో బాగుంది కదా !’ అన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా తారస్థాయిలో వినబడుతున్నాయి. ఇక... దీనికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.   బ్రిటన్ లో పేరుపొందిన బ్యాంకుల్లో ‘అటోమ్ బ్యాంక్’ ఒకటి. కోవిడ్ నేపధ్యంలో పనివిధానాల్లో మెరుగైన మార్పులు తీసుకురావాలంటున్న ఆ బ్యాంక్ సీఈఓ మార్క్ ముల్లెన్... వారానికి నాలుగు రోజుల పనివిదానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


ఈ(నవంబరు) నెల ఒకటో తేదీనుంచే ఈ విధానం అమల్లోకొచ్చింది కూడా. ఈ క్రమంలో... ఇప్పటివరకు... వారానికి 37.5 గంటలపాటు పనిచేసే ఉద్యోగులు...  ఇకముందు వారానికి కేవలం 34 గంటలు పనిచేస్తే చాలన్నమాట. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా, సమర్ధవంతంగా, ఆనందంగా పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని, అదే క్రమంలో... బ్యాంకు వాణిజ్య కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయని, అంతేకాకుండా... వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యమూ ఉండబోదని ఆయన గట్టిగా చెబుతున్నారు. కోవిడ్-19 వచ్చిన తరువాత అన్ని వ్యవస్థల్లోనూ మార్పులు వచ్చాయని, అయితే... వర్క్ ఫ్రమ్ హోమం విధానం ఒక్కటే సరిపోదని, తమ బ్యాంక్ అమలు చేస్తున్న సరికొత్త విధానం మునుముందు అందరూ అనుసరించక తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. 

Updated Date - 2021-11-29T23:16:07+05:30 IST