పప్పులు ఉండాల్సిందే!

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

చక్కని ఆరోగ్యానికి సరిపోను పోషకాలు, నాణ్యమైన ప్రొటీన్‌ ఎంత అవసరమో, జీర్ణాశయం పనితీరుకు ఫైబర్‌ కూడా

పప్పులు ఉండాల్సిందే!

చక్కని ఆరోగ్యానికి సరిపోను పోషకాలు, నాణ్యమైన ప్రొటీన్‌ ఎంత అవసరమో, జీర్ణాశయం పనితీరుకు ఫైబర్‌ కూడా అంతే అవసరం. పప్పులలో ఈ మూడు అమితంగా ఉంటాయి. ప్రొటోన్‌ లోపాన్ని అధిగమించేందుకు రోజూ ఆహారంలో పప్పుధాన్యాలతో పాటు శనగపిండి ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు పోషకాహార నిపుణురాలు కవితా దేవగణ్‌. 


 పప్పుధాన్యాలలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలోని ప్రొటీన్‌, పీచుపదార్థం గ్లూకోజ్‌ విడుదలను అదుపులో ఉంచుతాయి.


 పప్పులలోని ఐసోఫ్లావోనాయిడ్స్‌, ఫైటో స్టెరాల్స్‌ కేన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. 


 దెబ్బతిన్న కణాలను పునరుద్దరించే బి విటమిన్‌, ఫోలేట్‌ పప్పుధాన్యాలలో మెండుగా లభిస్తాయి. దాంతో చర్మం యవ్వనంగా ఉంటుంది. రోజు పప్పులు తింటే వయసు పెరిగినట్టు కనిపించరు.


 ప్యాకింగ్‌ చేసి ఉన్న, పాలిష్‌ చేయని పప్పుధాన్యాలనే ఎంచుకోవాలి. ఎందుకంటే వాటిలో పోషకాలు అలాగే ఉంటాయి. 


 రోజూ ఒకేరకం పప్పుధాన్యాలు కాకుండా భిన్నమైనవి వండుకోవాలి దాల్‌ టిక్కీ, సెనగగింజలతో కట్టామీటా సలాడ్‌, దాల్‌ సూప్‌, కిడ్నీ బీన్స్‌ వంటి వంటకాలు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచుతాయి. 


Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST