భావితరాలకు నీటి కొరత రానివ్వకూడదు

ABN , First Publish Date - 2021-02-28T05:17:06+05:30 IST

భావితరాలకు నీటి సమస్య రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర భూగర్భ జల సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం ఎర్రగుంట్లలోని మార్కెట్‌ యార్డులో భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జలవనరులు,

భావితరాలకు నీటి కొరత రానివ్వకూడదు
సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర భూగర్భ జల సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్బారావు

కేంద్ర భూగర్భ జల సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌

వర్షపు నీటిని ఊరు దాటనివ్వకూడదు

చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు పెంచాలి

ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 27: భావితరాలకు నీటి సమస్య రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర భూగర్భ జల సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం ఎర్రగుంట్లలోని మార్కెట్‌ యార్డులో భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జలవనరులు, నదీజలాల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనన నిర్వహణ ప్రణాళిక’పై ప్రజలతో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నీటి ఆవశ్యకత భవిష్యత తరాలకు వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వర్షపునీరు ఊరు దాటనివ్వకుండా వీలైనంత వరకు నిల్వ ఉంచుకోవాలని ఇంకుడు గుంతలు నిర్మించుకుని పొలాల్లో నీరు బాగా ఇంకిపోయేటట్లు చూడాలని అన్నారు. వంకలపైన, ఏటవాలు పొలాల్లోను చెక్‌డ్యాంలు నిర్మించుకుని నీటి నిల్వలు పెంచుకోవాలన్నారు.  రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త స్కీం ప్రారంభం కానుందని, దీంతో వారి దశ మారుతుందని అన్నారు. భావితరాలకు బ్యాంకు బ్యాలెన్స లాగా నీటి నిల్వలు పెంచాలన్నారు. తాగేందుకు ఎలాంటి నీరు వాడాలి అనే విషయంపై తెలియజేశారు. ప్రతి మూడునెలలకోసారి వాటర్‌ శాంపిల్స్‌ను తీసేందుకు బోర్లు వేస్తుంటామన్నారు. ఇందుకు అబ్జర్వర్‌ ఉంటారన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చంద్రమోహనసింగ్‌, డ్రిల్లర్‌ ఇనచార్జి గుప్త, సైంటిస్ట్‌ మహంత, ఎంపీడీవో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:17:06+05:30 IST