నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-02T10:43:35+05:30 IST

నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచాలని కలెక్టర్‌ భార తీ హోళికేరి సూచించారు.

నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి: కలెక్టర్‌

జన్నారం, జూలై 1 : నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచాలని కలెక్టర్‌ భార తీ హోళికేరి సూచించారు. జన్నారం మండలంలోని కామన్‌పల్లి, దేవునిగూడ, కొత్త పేట, కవ్వాల గ్రామాల్లో బుధవారం  కలెక్టర్‌ పర్యటించారు. కవ్వాల గ్రామం లో డంపింగ్‌యార్డ్‌కు నిధులు మంజూరైనా పనులు ఎందుకు పూర్తి కాలేదని సర్పంచ్‌ లక్ష్మి రాథోడ్‌పై ఆగ్రహం వ్యక్తం  చేశారు. అదే విధంగా కామన్‌పల్లి, దేవునిగూడ, కొత్తపేట గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌లను, శ్మశాన వాటికలను పరిశీ లించారు.


అదే విధంగా ప్రతీ నర్సరీలో 5 వేల మొక్కలుండాలని, అన్ని రకాల మొక్కలు అందరు ఉపయోగించుకునే విధంగా ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఎంపీడీఓ అరుణారాణి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌లను ఆదేశించా రు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. 

Updated Date - 2020-07-02T10:43:35+05:30 IST