కల్యాణోత్సవంలో అపచారంపై చర్చ జరగాల్సిందే..

ABN , First Publish Date - 2022-05-23T07:28:56+05:30 IST

రాయదుర్గం పట్టణంలోని వెంకటరమణ స్వామి కల్యాణోత్సవంలో జరిగిన అపచారంపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కల్యాణోత్సవంలో అపచారంపై చర్చ జరగాల్సిందే..
మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

రాయదుర్గం గుడికి వెళ్లి తీరతాం..!  

ఎట్టికి వచ్చామని మమ్మల్ని అరెస్టు చేస్తారా.? 

సవాల్‌ విసిరిన కాపు రామచంద్రారెడ్డిని 

ఎందుకు చేయలేదు..?: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి 

అనంతపురం, అర్బన మే 22:  రాయదుర్గం పట్టణంలోని వెంకటరమణ స్వామి కల్యాణోత్సవంలో జరిగిన అపచారంపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  స్వామి కల్యాణమహోత్సవంలో అపచారం జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. తప్పు చేసిన వారే సవాల్‌ విసరడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. సవాల్‌ను స్వీకరించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆలయానికి వెళుతుంటే మార్గమధ్యంలోనే అడ్డగించి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తనను కూడా ఆలూరు కోనకు వెళ్లకుండా పోలీసులతో అడ్డగించారన్నారు. మమ్మల్ని ఆలయాలకు కూడా వెళ్లనివ్వరా అంటూ మండిపడ్డారు. సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే  కాపు రామచంద్రారెడ్డిని ఎందుకు హౌస్‌ అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మేము ఎట్టికి వచ్చామని ప్రతి సారి అరెస్టులు చేస్తారా..? అంటూ నిలదీశారు. పోలీసు అనే మహావృక్షం కింద వైసీపీ నాయకులు బతుకుతున్నారని విమర్శించారు. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులుతో చర్చించి, రాయదుర్గం ఆలయానికి వెళ్లే  తేదీని ఖరారు చేసి, అక్కడికి వెళ్లితీరుతామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలా పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేయించే సంస్కృతి ఉండదన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 

Updated Date - 2022-05-23T07:28:56+05:30 IST