అమెరికాలో ఒక్కరోజే 53వేలకుపైగా కరోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-07-04T00:57:57+05:30 IST

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. యూఎస్‌లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కా

అమెరికాలో ఒక్కరోజే 53వేలకుపైగా కరోనా కేసులు..!

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. యూఎస్‌లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కాగా.. అమెరికాలో గురువారం రోజు నమోదైన కరోనా కేసుల వివరాలను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే అమెరికాలో 53వేలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే 649 మంది కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 27.35లక్షలకు చేరగా.. 1.28లక్షల మరణాలు సంభవించినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేస్తుండటం వల్లే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రపంచంలోని ఇతర ఏ దేశం కూడా ఇంత పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగుతున్న విషయాన్ని గొప్ప వార్తగా అభివర్ణించిన ఆయన.. మరణాల సంఖ్య తగ్గడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-07-04T00:57:57+05:30 IST