Abn logo
Mar 27 2020 @ 00:24AM

ఐసోలేషన్‌ వార్డుపై భయపడాల్సింది ఏమీలేదు..ఎమ్మెల్యే కిలివేటి

తడ మార్చి 26 : ఐసోలేషన్‌ వార్డు అంటే రోగులను తీసుకొచ్చి పెడ్తారనికాదు.. కేవలం  ప్రాథమికంగా నిర్ధారణ కోసమే ఉంచుతారని, అంతేగాని దానివల్ల భయపడాల్సింది ఏమీలేదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.  భీములవారిపాళెం పడవలరేవు వద్ద నూతనంగా నిర్మితమైన రిసార్టులను ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. విషయం తెలుసుకున్న భీములవారిపాళెం గ్రామస్థులు దీనిపై అభ్యంతరం తెలియజేశారు.


దీంతో గురువారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట ఆర్డీవో సరోజినీ, గూడూరు డీఎస్పీ భవానీ శ్రీహర్ష గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కిలివేటి వారిని కోరారు. దీంతో స్పందించిన గ్రామస్థులు తమకు కొంత సమయం ఇవ్వాలని చెప్పడంతో వారు వెనుతిరిగారు. వారితో పాటు సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దారు శాంతకుమారి, ఎంపీడీవో శివయ్య, ఎస్‌ఐ వేణు, వైసీపీ మండల కన్వీనర్‌ కొలవి రఘు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement