Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 20 Aug 2022 05:13:35 IST

పతనమైన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదు

twitter-iconwatsapp-iconfb-icon
పతనమైన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదు

నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరం 

పదవుల కోసం తల వంచేవాడిని కాదు: ఎమ్మెలే భూమన

ఇంత మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు...  తిరుపతి ప్రజలకు అభినందనలు: జస్టిస్‌ ఎన్వీ రమణ 


తిరుపతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని, పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సమక్షంలో భూమన చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తక ప్రతులను శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణాకర రెడ్డి మాట్లాడారు. పదవుల కోసం తలవంచేవాడిని కాదని, పదవుల కంటే నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపడమే గొప్పగా భావించేవాడినన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలు జీవితం గడిపిన సమయంలో ఎందరో మహామహులతో పరిచయం కావడం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.  గొప్ప గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణం కూడా అంతే గొప్పగా ఉండాలన్నారు. గాంధీ ఆత్మకథకు సంబంధించి విస్మరించిన ఈకోణాన్ని ఇపుడు పదేపదే చదవాల్సిన అవసరముందన్నారు. గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను ఇపుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట నిందితుడిగా చేతులు కట్టుకుని ఒప్పుకుంటున్నానన్నారు.  2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తీరని అన్యాయం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డానన్నారు. సభ సాక్షిగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. 


తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి: జస్టిస్‌ రమణ 

అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం చాలా కష్టమని, చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలన్నారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం చిన్న విషయం కాదన్నారు. గొప్ప మనసుతో పరివర్తన చెందిన మనిషిగా ఆయన నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు.  ప్రస్తుత రాజకీయాల తీరుపై జస్టిస్‌ రమణ వేదనాభరితమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఏవగించుకుని, అసహ్యించుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, విలువలు, నిజాయితీ కలిగిన వ్యక్తులను, అవినీతికి పాల్పడని వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. సత్యశోధన... ప్రతి రాజకీయ నాయకుడూ చదవాల్సిన మొదటి, చివరి పుస్తకంగా ఆయన అభివర్ణించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.