ఆ వార్తల్లో నిజం లేదు 'పుష్ప' టీమ్ క్లారిటీ..

గత రెండు రోజులుగా 'పుష్ప' సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా మేకర్ వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. రెండు భాగాలుగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తుండగా 'పుష్ప ది రైజ్ పార్ట్ 1' డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా హాజరవనున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శ‌ర‌త్ చంద్ర సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు  'పుష్ప' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ వస్తున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  


Advertisement