జిల్లాలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-14T07:19:36+05:30 IST

జిల్లాలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

జిల్లాలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదు : కలెక్టర్‌
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 13: జిల్లాలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్ర భుత్వ జనరల్‌ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు పెషంట్ల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని కోరారు. జిల్లాలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు రోగుల పట్ల అంకిత భావంతో సేవలు అందించాలని, ప్రతి ఆస్పత్రిల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కోటాచలం, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, ఆర్డీవో రాజేందర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T07:19:36+05:30 IST