Abn logo
Jul 6 2020 @ 07:16AM

ఆసుప‌త్రుల‌లో ప‌డ‌క‌ల‌కు కొర‌త లేదు: సీఎం

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ -19 ఆసుపత్రిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. ఈ‌ ఆసుపత్రిలో 1,000 పడకల సామర్థ్యంతో పాటు 250 ఐసీయూ పడకలు కూడా ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులలో పడకల కొరత లేద‌ని, 15 వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. వాటిలో ప్ర‌స్తుతం 5,300 పడకలు మాత్రమే నిండి ఉన్నాయ‌ని, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ  పడకలు అవ‌స‌ర‌మ‌వుతాయని అన్నారు. ఆసుప‌త్రుల‌లో చేరుతున్న రోగుల సంఖ్య త‌గ్గుతున్న‌ప్ప‌టికీ, అత్య‌వ‌స‌రంగా ప‌డ‌క‌లు అవ‌స‌ర‌మ‌య్యే క‌రోనా బాధితుల‌కు ఇవి ఉప‌యుక్త‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement