Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండోసారి వైరస్‌ సోకదనేందుకు ఆధారాల్లేవ్‌!

బెర్లిన్‌, ఏప్రిల్‌ 25: కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారికి రెండోసారి అదే వైరస్‌ సోకదనేందుకు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వారిలోని రోగనిరోధకాలు మళ్లీ వారు వైరస్‌ బారిన పడకుండా కాపాడతాయని చెప్పలేమని పేర్కొంది. ఇదేసమయంలో ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్‌లు’ జారీ చేయాలని కొన్ని ప్రభుత్వాలు చేసిన ఆలోచన పట్ల హెచ్చరిక జారీ చేసింది. ఒకసారి ఈ సర్టిఫికెట్‌ పొందిన వారు ప్రజా ఆరోగ్య మార్గదర్శకాలను పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా వ్యాధిని మరింతగా విస్తరింపజేసే రిస్క్‌ పొంచి ఉంటుందని పేర్కొంది. 

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement