విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండొద్దు

ABN , First Publish Date - 2020-09-19T09:45:48+05:30 IST

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తునందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండొద్దు

జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి


భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 18: కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తునందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన 1వ, 7వ స్థాయి సంఘం(ఆర్థిక, పనులు), 4వ స్థాయి సంఘం (విద్య, వైద్యం) సమావేశాల్లో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సరఫరాలో అంతరా యం ఏర్పడితే  టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను వీక్షిస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు.  మిషన్‌ భగీరథ ద్వారా అన్ని ఆవాస గ్రామాలకు శుద్ధమైన నీటిని అందించాలని మోటకొండూరు, నారాయణపూర్‌, మోత్కూ రు జడ్పీటీసీలు పల్లా వెంకట్‌రెడ్డి, వీరమళ్ల భాను, బోరుపల్లి శారద అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


నాసిరకం మాస్కులతో వైద్యుల ఇబ్బందులు: కాంగ్రెస్‌

జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం నాసిరకం మాస్కులు పంపిణీ చేస్తున్నందున సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ జడ్పీఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  నాసిరకం మాస్కులను సమావేశంలో సభ్యులను చూయించారు. ఇప్పటీకే జిల్లాలో 58 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపా రు. హోం ఐసోలేషన్‌ విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం లకు, ఆశావర్కర్లకు పీపీఈ కిట్లు అందేవిధం గా చర్యలు తీసుకోవాల ని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబ శివరావుకు సూచించారు. శిథిలావస్థకు చేరిన పీహెచ్‌సీలకు మరమ్మతులు నిర్వహించి, మౌలిక వసతులు కల్పించి  రోగులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  సమావేశంలో జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, అడ్డగూడూరు జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి , కోఆప్షన్‌ సభ్యులు ఎండీ ఖలీల్‌, ఆర్‌అబ్లుఎస్‌, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈలు లక్ష్మణ్‌, జయారెడ్డి, శంకర య్య, డీసీహె్‌సఎస్‌ డాక్టర్‌ వై.ప్రకాశ్‌, డీఈవో చైతన్య జైనీ, ఈఎస్‌ కృష్ణప్రియ, వీణ, జడ్పీ సూపరింటెండెంట్లు  బి యాదగిరి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


భూదాన్‌పోచంపల్లి మండలానికి నిధులు కేటాయించండి

భూదాన్‌పోచంపల్లి:  భూదాన్‌పోచంపల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవిశ్రీశైలంగౌడ్‌ జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డిని కలిసి తన ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.  వంకమామిడి గ్రామంలోని జడ్పీహెచ్‌స్‌లో ప్రహరీ నిర్మాణానికి రూ.2లక్షలు, యూపీఎ్‌సలో వంటగది నిర్మాణానికి రూ.3 లక్షలు, దంతూరు గ్రామంలో బీసీ గీత కార్మికుల సహకార సంఘం భవనాన్ని పూర్తి చేయడానికి రూ.2 లక్షలు 50 వేల నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సందీ్‌పరెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. 

Updated Date - 2020-09-19T09:45:48+05:30 IST