ఇల్లూ లేదు...బిల్లూ లేదు

ABN , First Publish Date - 2020-06-06T08:33:17+05:30 IST

ఏడాది కాలం గా ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.

ఇల్లూ లేదు...బిల్లూ లేదు

ఏడాదిగా గృహ నిర్మాణంలో ఇదీ పరిస్థితి 

గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన బకా యిలు రూ.112 కోట్లు నేటికీ పెండింగ్‌ 

సీఎం ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆశలు 


అనంతపురం క్లాక్‌టవర్‌, జూన్‌ 5 : ఏడాది కాలం గా ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. గత ప్రభుత్వ హయాంలో కట్టుకున్న ఇళ్లకు బిల్లులూ మంజూరు చేయలేదు. అప్పులు చేసి గృహ నిర్మాణం పూ ర్తి చేసుకున్న 30827 లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.112.18 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత ఐదేళ్లలో జిల్లాకు పీఎంఏవై, అహుడా, ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద 1.71 లక్షలు ఇళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 50006 ఇళ్లు పూర్తి చేశారు. సుమారు 40 వేల మంది ఇంతవరకు నిర్మాణాలే ప్రారంభించలేదు. ఈ 40వేల ఇళ్లను రద్దు చేశారు. మిగిలిన వాటిలో 45 వేల ఇళ్లు మా త్రమే నిర్మాణంలో ఉన్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న హౌసింగ్‌ బకాయిలను చెల్లిస్తామని సీఎం ప్రకటించ డంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి.


40వేల ఎన్టీఆర్‌ గృహాలు రద్దు

గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన 40 వేల ఇళ్లను రద్దు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేద ని భావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.    లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించామని అధికారులు చెబుతున్న వాదనను  ప్రభుత్వం పరిగణలో కి తీసుకోవడం లేదు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సైతం సిమెంట్‌, ఇటుక, ఇనుము సరఫరా నిలిపివేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం కూడా ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పా టైన నేపథ్యంలో హౌసింగ్‌ కార్యకలాపాలు మొత్తం స్తం భించి పోయాయి. జిల్లాలో హౌసింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఇటుకల తయారీ కేంద్రాల్లో (నిర్మితకేంద్రాలు) కూ డా పనులు ఆగిపోయాయి. అనంతపురం, హిందూపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలలో నాలుగు నిర్మిత కేంద్రాలు ఉన్నప్పటికీ ఇటుకల తయారీ నిలిపివేశారు.  తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన ఇళ్ల బకాయిల చెల్లింపుల ఆదేశాలు అమలయ్యేనా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.


అహుడా పరిధిలో ఇళ్లకు మోక్షం కలిగేనా ?

అహుడా(అనంతపురం హిందూపురం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ) పరిధిలో జిల్లాకు 60266 ఇళ్లు మంజూ రయ్యాయి. వీటిని కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మంజూరైన ఈ ఇళ్లకు మో క్షం కలిగేనా అనే సందేహం అందరిలో మెదులుతోంది.    గత ప్రభుత్వ హయాంలో 42499 ఇళ్లు కేటాయించారు.  మంజూరు, నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సమ యంలో ఎన్నికల కోడ్‌ రావడంతో నిలిపివేశారు. వాటికి ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

 

బకాయిల చెల్లింపులకు చర్యలు : చంద్రమౌళిరెడ్డి, హౌసింగ్‌ ఇన్‌చార్జ్‌ పీడీ

ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తాం. జిల్లాలో రూ.112.18కోట్లు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ఉన్నతాధికారుల నుంచి బిల్లులు చెల్లిం చేందుకు సానుకూలంగా సమాచారం వచ్చింది. దీని ఆధారంగా బిల్లులు చెల్లించే అవకాశముంది. ఇళ్ల నిరా ్మణాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఉన్నతాధికా రుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభు త్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ప్రగతి ప్రణాళికలు రూపొందించుకుంటాం. వివిధ పథకాల కింద ఇళ్లు మంజూరై నిర్మించుకుంటున్న లబ్ధిదారులందరికీ పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం. 

Updated Date - 2020-06-06T08:33:17+05:30 IST