రైతు రుణమాఫీ ప్రతిపాదన లేదు

ABN , First Publish Date - 2021-07-27T08:53:03+05:30 IST

రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి భగవత్‌ కరడ్‌ స్పష్టంచేశారు.

రైతు రుణమాఫీ ప్రతిపాదన లేదు

  • తెలంగాణలో రైతు రుణ బకాయిలు 84 వేల కోట్లు
  • ఏపీలో 1.69 లక్షల కోట్లు : కేంద్ర మంత్రి భగవత్‌ కరడ్‌ 

రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి భగవత్‌ కరడ్‌ స్పష్టంచేశారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి రైతులు రూ. 16.8 లక్షల కోట్ల రుణాలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని సోమవారం ఆయన లోక్‌సభకు తెలిపారు. నాబార్డు సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి 31 వరకు తెలంగాణలో 63.22 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించి రైతులు రూ. 84 వేల కోట్లు, ఏపీలో 1.2 కోట్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించి రూ. 1.69 లక్షల కోట్ల రుణ బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. 

Updated Date - 2021-07-27T08:53:03+05:30 IST