‘ఆత్మ’కు ఆదరణ కరువు

ABN , First Publish Date - 2022-07-06T05:59:10+05:30 IST

వ్యవసాయం లాభసాటిగా మార్చడంలో భాగంగా అన్నదాతలకు అధునిక విజ్ఞానం, అవగాహణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు నిధుల కటకట పట్టుకుంది.

‘ఆత్మ’కు ఆదరణ కరువు
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం

- పత్తాలేని సదస్సులు, యాత్రలు

- అన్నదాతకు అవగాహణ కార్యక్రమాలు లేవు

- రెండేళ్లుగా నిలిచిన పథకం

జగిత్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం లాభసాటిగా మార్చడంలో భాగంగా అన్నదాతలకు అధునిక విజ్ఞానం, అవగాహణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు నిధుల కటకట పట్టుకుంది. జగిత్యాల జిల్లాలో రెండేళ్లుగా ఆత్మ పథకానికి నిధులు విడుదల కాకపోవడంతో కార్యక్రమాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించి వ్యవసాయ సీజన్‌ ప్రారంభం లోనే సాగుతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశు సంవర్థక, ఉద్యాన, మత్స్యశాఖల అధికారులు సంయుక్తంగా రైతులకు అవగాహణ కల్పించా ల్సి ఉంటుంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభ మైనప్పటికీ ఆత్మ కింద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా రైతులకు సాగు సమయంలో తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలపైన అవగాహణ కరువవుతోంది. విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో రైతులకు సూచనలు, సలహాలు అందడం లేదు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 4.40 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తారన్న అంచనాలున్నాయి. 

విడుదల కాని నిధులు

జిల్లా నుంచి 2022-23 సీజన్‌లో ఆత్మ ద్వారా సూచనలు అందించేం దుకు ప్రభుత్వానికి రూ.40 లక్షల నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపించగా ఆమోదం లభించింది. అయితే ఇప్పటివరకు నిధుల మంజూరు జరగలేదు. నిధులు విడుదల కాకపోవడం వల్ల వ్యవసాయ అధికారులు, సంబందిత రంగాల అధికారులు రైతులకు ఎటువంటి అవగాహణ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గత ఏడాది సైతం ఆత్మ కార్యక్రమాలకు నిధులు మంజూరు కాలేదు. సుమారు గత నాలుగు, అయిదు సంవత్సరాలుగా ఆత్మ నిధులు సరియైన సమయాల్లో రాకపోయినప్పటికీ వ్యవసాయ అధికారుల వద్ద నిలువ ఉన్న ఇతర నిధుల ద్వారా కార్యక్రమాలు చేపట్టారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయకపోవడం, ఇతర నిధులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల అధికారులు ముందుకు కదలడం లేదు. 

సదస్సులు లేవు.. యాత్రలు కనిపించవు

ప్రస్తుత యేడాది వానాకాలంలో ఎలాంటి సూచనలు, సలహాలు, సదస్సులు, విజ్ఞాన యాత్రలు ఆత్మ ద్వారా జరగడం లేదు. అందు బాటులో శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. గతంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రం, వ్యవసాయ సబ్‌ డివిజన్‌ కేంద్రాల్లో ఘనంగా రైతు సదస్సులు నిర్వహించే వారు. రైతులను రప్పించి స్థానికంగా పలు ప్రదర్శనలు ఇచ్చే వారు. ప్రతి యేడాది వేసవి, వానాకాలం సీజన్లకు ముందుగా ఇతర జిల్లాల్లో అనుసరిస్తున్న విధాలను ప్రత్యక్షంగా వివరించేందుకు ఆత్మ పథకం కింద ప్రత్యేక బస్సుల్లో విజ్ఞాన యాత్రలకు రైతులను తీసుకవెళ్లి అవగాహణ కల్పించే వారు. ప్రస్తుతం ఇటువంటి వాటికి అధికారులు స్వస్తి పలకడంతో రైతులు ఎవరికి వారే మెళుకు వలను తెలుసుకొని సాగు చేసుకునే దుస్థితి నెలకొంది.

అనుబంధ శాఖల్లోనూ ఇదే పరిస్థితి

వ్యవసాయంలో రైతులు మెరుగైన ఆదాయం సాధించేందుకు అవసర మైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన పశు, మత్స్య, ఉద్యాన, పట్టు, ఫౌలీ్ట్ర, మార్కెటింగ్‌ వంటి వాటిల్లో సైతం ఒకే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ఆత్మ ద్వారా శిక్షణలు, అవగాహణ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పర్యటనలు, నూతన సాంకేతికత అభివృద్ధి అంశాలు, కిసాన్‌ మేళాలు, శాస్త్రవేత్తలతో రైతుల సమావేశాలు, ఫామ్‌ పాఠశాలలు, మార్కెటింగ్‌ అంశాలు, ఎరువులు, విత్తనాల వినియోగం, సాగులో ప్రతిభ కనబరిచిన రైతులకు ప్రోత్సాహకాలు, పలు అంశాలపై అవగాహణ వంటివి నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. తాత్కాలికంగా సొంత డబ్బులను వెచ్చించి కార్యక్రమాలను నిర్వహిద్దామనుకున్నా ఎప్పుడు మం జూరు అవుతాయో తెలియక వెనుకడుగు వేస్తున్నారు.

బడ్జెట్‌ మంజూరు కాలేదు

- సురేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

ఆత్మ పథకం ద్వారా రైతులకు శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందించాం. ప్రభుత్వం బడ్జెట్‌ మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాకు అవసరమైన బడ్జెట్‌ మంజూరు అయితే రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే వీలుంది. ప్రస్తుతం రైతులకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

సదస్సులు, యాత్రలు నిర్వహించాలి

-కూసరి మల్లారెడ్డి, రైతు, వెల్దుర్తి  

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా అధికారులు వ్యవసాయ సదస్సులు నిర్వహించాలి. వివిధ అం శాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 


Updated Date - 2022-07-06T05:59:10+05:30 IST