న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: అనిత

ABN , First Publish Date - 2020-05-22T21:13:36+05:30 IST

ప్రభుత్వాలపై తమకు నమ్మకం లేకపోయినా.. న్యాయ వ్యవస్థమీద నమ్మకం ఉందని..

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: అనిత

విశాఖ: ప్రభుత్వాలపై తమకు నమ్మకం లేకపోయినా.. న్యాయ వ్యవస్థమీద నమ్మకం ఉందని టీడీపీ నేత అనిత అన్నారు. అందుకు నిదర్శనమే డాక్టర్ సుధాకర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పని అన్నారు. డా. సుధాకర్ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. దీనిపై స్పందించిన అనిత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాను రాసిన ఒక లేకపై న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిందన్నారు. డా.సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకుని ఇవాళ విచారణ జరిపి సీబీఐకి అప్పగించడం చాలా శుభపరిణామమని అన్నారు.


డాక్టర్ సుధాకర్.. ఆయన తల్లి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని చెబుతున్నారని అనిత అన్నారు. ఇవాళ కోర్టు తీర్పుతో డాక్టర్‌కు సగం వరకు న్యాయం జరిగిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇది డాక్టర్ సుధాకర్ విషయం కాదని, దళితశాఖ ఆత్మగౌరవానికి సంబంధించినదని అన్నారు. అదే అగ్రవర్ణానికి చెందినవారైతే ఇలాగే కొడతారా? అని ఆమె ప్రశ్నించారు. దళితుడు అంటే అంత చులకనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైనే తాము పోరాడామని ఆమె స్పష్టం చేశారు. ఆత్మగౌరవాన్ని ఎవరు టచ్ చేసినా పరిస్థితి ఇలాగే ఉంటుదన్నారు. ఈ సందర్భంగా అనిత న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరించారు.

Updated Date - 2020-05-22T21:13:36+05:30 IST