ఓటర్ల క్యూలైన్లు లేవు... అయినా ఓట్లేశారు..!

ABN , First Publish Date - 2021-04-09T05:42:30+05:30 IST

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్షంగా సైలెంట్‌గా ఓట్లేసుకున్నారు.

ఓటర్ల క్యూలైన్లు లేవు... అయినా ఓట్లేశారు..!
ఓటర్లు లేక బోసిపోయిన లేపాక్షి మండలంలోని కల్లూరు పోలింగ్‌ కేంద్రం

హిందూపురం, ఏప్రిల్‌ 8: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్షంగా సైలెంట్‌గా ఓట్లేసుకున్నారు. ఈనేపథ్యంలోనే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లు లేకున్నా ఓటింగ్‌ శాతానికి వచ్చే సరికి ఓటింగ్‌ శాతం మాత్రం పెరిగిందన్న ఓటర్లులోనే చర్చలకు దారీతీస్తోంది. హిందూపురం, పెనుకొండ నియోజక వర్గాల్లో గురువారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నమోదైన పోలింగ్‌ తీరు చూస్తే అధికార వైపీసీ పోలింగ్‌ కేంద్రాల్లో సైక్లీంగ్‌తోపాటు రిగ్గింగ్‌ చేసినట్లు స్పష్టమైంది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా హిందూపురం, లేపాక్షి మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినా అధికార పార్టీ మాత్రం పోలింగ్‌లో భారీగా సైక్లీంగ్‌ చేశారు. హిందూపురంలో పట్టణ వైసీపీ నేతలు బృందాల వారిగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని సైక్లీంగ్‌ చేశారు. హిందూపురం మండలం కొటిపి, బేవనహళ్లి, మణేసముంద్రంతోపాటు పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా కనిపించారు, ఇక మిగిలిన చోట్ల మందకొడిగా సాగింది. లేపాక్షిలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మినహా చాలా చోట్ల ఓటర్లు ఉదయం నుంచే మందకొడిగానే సాగింది. అయినా హిందూపురంలో 67.56 శాతం, లేపాక్షిలో 68.92 ఓటింగ్‌ శాతం నమోదుతో ఓటర్లు రాకున్నా వైసీపీ భారీగానే సైలెంట్‌గా ఓట్లేసుకున్నారు. ఇక చిలమత్తూరు, పరిగి, పెనుకొండ. సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఓటర్లు క్యూలైన్లు కన్పించకున్నా ఓటింగ్‌ శాతం మాత్రం పెరిగింది. ఉదయం నుంచి అధికార వైసీపీ ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సైలైంట్‌గానే సైక్లీంగ్‌తో ఓట్లును వేసుకుని ఓటింగ్‌ శాతాన్ని పెంచేశారు. కొన్నిచోట్ల మినహయిస్తే అత్యధికంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు మందకొడిగా ఓటింగ్‌కు వచ్చారు. అయితే మధ్యాహ్నాం తరువాత అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ శాతం పెరగడం వెనుక ఏమేరకు పోలింగ్‌లో అక్రమాలు జరిగాయే తెలుస్తోంది. ఓట్లేసేందుకు భారీగా ఓటర్లు క్యూలైన్లు లేకపోయినా పరిగిలో 63.62. పెనుకొండలో 60.99. సోమందేపల్లిలో 55.29, రొద్దంలో 54.14, గోరంట్లలో 46.38 శాతం నమోదు అయ్యింది. చిలమత్తూరులో వైసీపీ నాయకులు బరితెగించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొనేందుకు ఓటర్లు ఆసక్తి చూపకపోయినా నమోదైన పొలింగ్‌ తీరు మాత్రం ఓటర్లలో చర్చంశనీయంగా మారింది.  


Updated Date - 2021-04-09T05:42:30+05:30 IST