Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 02:28:16 IST

స్టార్లు లేరు.. కథనే నమ్మాం

twitter-iconwatsapp-iconfb-icon

ఆది సాయి కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్లాక్‌’. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ కౌశల్‌ కీలక పాత్ర పోషించారు. జిబి కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్‌ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో సాయికుమార్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తోంది. ఈ సినిమా మే 28న విడుదల అవుతోంది. అది అన్న ఎన్టీఆర్‌ గారి పుట్టిన రోజు. అంత గొప్ప రోజున విడుదల అవుతున్న మా అబ్బాయి చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంద’’న్నారు. ‘‘మా సినిమాలో స్టార్లు లేరు.. కానీ స్టార్‌ కంటెంట్‌ ఉంది. కథని నమ్ముకొని తీసిన సినిమా ఇద’’ని దర్శకుడు తెలిపారు. ‘‘దర్శకుడు కథ చెప్పగానే బాగా నచ్చింది. సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయ’’న్నారు ఆది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International