ఆలయంలో ప్రధాన అర్చకులెవరూ లేరు

ABN , First Publish Date - 2020-11-30T04:58:17+05:30 IST

శ్రీముఖలింగ ముఖలింగేశ్వరాలయంలో ప్రధాన అర్చకులు ఎవరూ లేదని, ఈ పేరుతో అనుమతులు లేకుండా హోమాలు, పూజలు చేయడం నేరమని దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ జి.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు.

ఆలయంలో ప్రధాన అర్చకులెవరూ లేరు


శ్రీముఖలింగం (జలుమూరు) నవంబరు 29:  శ్రీముఖలింగ ముఖలింగేశ్వరాలయంలో ప్రధాన అర్చకులు ఎవరూ లేదని, ఈ పేరుతో అనుమతులు లేకుండా హోమాలు, పూజలు చేయడం నేరమని దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ జి.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. నాయుడుగారి రాజశేఖర్‌ దేవాలయ ప్రధాన అర్చకుల పేరుతో ప్రకటన లిచ్చి ఆలయంలో హోమం నిర్వహిస్తున్నట్లు, అలాగే గోత్ర నామాలతో పూజలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందన్నారు. శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆన్‌ లైన్‌ కార్యక్రమాలు, సేవలు దేవస్థానం ప్రవేశ పెట్టలేదన్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి దేవాలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సమావేశంలో ఈవో  ఎన్‌.వి.రమణయ్య సిబ్బంది నాగేశ్వరరావు, అర్చకుల సంఘం అధ్యక్షుడు పెద్దలింగన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T04:58:17+05:30 IST