భువనగిరికి నాలుగు బస్తీదవాఖానాలు

ABN , First Publish Date - 2022-08-17T06:20:08+05:30 IST

ప్రభుత్వ వైద్యం జిల్లాకేంద్రం భువనగిరి పట్టణ ప్రజలకు మరింత చేరువకానుంది. ఇప్పటికే భువనగిరిలో జిల్లా ఆస్పత్రి, అర్బన్‌కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఉం డగా తాజాగా మరో నాలుగు బస్తీ దవాఖానాలను ప్రభు త్వం మంజూరు చేసింది.

భువనగిరికి నాలుగు బస్తీదవాఖానాలు

అర్బన్‌కాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం శాశ్వత భవనం కోసం రూ.95లక్షలు మంజూరు  

 కొనసాగుతున్న డయాగ్నోస్టిక్‌ హబ్‌ భవన నిర్మాణ పనులు

డయాలసిస్‌ కేంద్రం భవనం కోసం త్వరలో టెండర్లు 

 ప్రభుత్వ వైద్యం జిల్లాకేంద్రం భువనగిరి పట్టణ ప్రజలకు మరింత చేరువకానుంది. ఇప్పటికే భువనగిరిలో జిల్లా ఆస్పత్రి, అర్బన్‌కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఉం డగా తాజాగా మరో నాలుగు బస్తీ దవాఖానాలను ప్రభు త్వం మంజూరు చేసింది. అలాగే అర్బన్‌కాలనీలో అద్దె భవనంలో  కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరో గ్య కేంద్రం శాశ్వత భవనం కోసం రూ.95లక్షలు మం జూరయ్యాయి. జిల్లా ఆస్పత్రి ఆవరణలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటుకోసం భవన నిర్మాణ పను లు ప్రా రంభంకాగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకోసం భవన నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలువనున్నారు. దీంతో భువనగిరివాసులతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా స్థానికంగా మెరుగైన వైద్యం లభించనుంది. 

- భువనగిరి టౌన్‌

ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన బస్తీ దవాఖానాలు భువనగిరి పట్టణానికి నాలుగు మంజూరయ్యాయి. అయితే బస్తీ దవాఖానాల నిర్వహణ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించదు. కానీ వైద్యులు సిబ్బంది, మందులు తదితర వైద్య సదుపాయాలన్నీ కల్పిస్తుంది. దీంతో పట్టణంలోని మునిసిపల్‌  కమ్యూనిటీ హాళ్లలో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు రాయిగి రి, జగదేవ్‌పూర్‌రోడ్డు, హనుమాన్‌వాడ, అబాదీ ప్రాంతంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. భవనాల లభ్యత ఆధారంగా బస్తీ దవాఖానాల ఏర్పాటు ప్రాంతాలు మారవచ్చు. ఈమేరకు భవనాల గుర్తింపుకోసం త్వరలో మునిసిపల్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. అలాగే అర్బన్‌కాలనీలో అద్దె భవనంలో కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం శాశ్వత భవనంకోసం వైద్యారోగ్య శాఖ రూ.95లక్షలు మంజూరు చేసింది. అర్బన్‌కాలనీలో వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న మునిసిపల్‌ కమ్యూనిటీ హాల్‌కు మెరుగులుదిద్ది అరోగ్యకేంద్రాన్ని తరలించనున్నారు. 

ఈమేరకు త్వరలో మరమ్మతు పనులు ప్రారంభంకానున్నాయి. కాగా జిల్లా ఆస్పత్రి ఆవరణలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ నిర్మాణంకోసం భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలివరకు డీఎంహెచ్‌వో కార్యాలయం కొనసాగిన భవనంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం త్వరలో భవన మరమ్మత్తు  పనుల కు అధికారులు టెండర్లు పిలువనున్నారు. ప్రతిపాదిత బస్తీ దవాఖానాలు, డయాలసిస్‌, కేంద్రం, డయాగ్నోస్టిక్‌ హబ్‌ అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. 


బస్తీ  దవాఖానాల ఏర్పాటు కోసం భవనాలను పరిశీలిస్తున్నాం  : ఎనబోయిన ఆంజనేయులు, చైర్మన్‌, భువనగిరి మునిసిపాలిటీ  

మంత్రి హరీ్‌షరావుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిమేరకు వైద్యారోగ్య శాఖ భువనగిరి కి నాలుగు బస్తీ దవాఖానాల మంజూరుకు సుముఖతచూపింది.ఈమేరకు బస్తీ దవాఖానాల ఏ ర్పాటు కోసం భవనాలను పరిశీలిస్తున్నాం.ఇందుకోసం డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు, ము నిసిపల్‌ కమిషనర్‌ బి.నాగిరెడ్డితో కలిసి భవనాలను పరిశీలిస్తాం.భవనాల ఎంపిక పూర్తయిన వెం టనే అవసరమయిన మరమ్మతు పనులు పూర్తిచేసి బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెస్తాం. 

Updated Date - 2022-08-17T06:20:08+05:30 IST