నగల దుకాణంలో 30 కిలోల బంగారం చోరీ

ABN , First Publish Date - 2021-12-16T15:37:55+05:30 IST

నగరంలోని జోస్‌ అలూకాస్‌ నగల దుకాణంలో దొంగలుపడ్డారు. ఏకంగా 30 కిలోల నగలు చోరీ అయినట్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు స్థానిక తోటపాళ్యంలోని ఈ నగల దుకాణానికి

నగల దుకాణంలో 30 కిలోల బంగారం చోరీ

                     - నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు


వేలూరు(చెన్నై): నగరంలోని జోస్‌ అలూకాస్‌ నగల దుకాణంలో దొంగలుపడ్డారు. ఏకంగా 30 కిలోల నగలు చోరీ అయినట్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు స్థానిక తోటపాళ్యంలోని ఈ నగల దుకాణానికి చేరుకున్న సిబ్బంది.. వెనుక వైపున్న గోడకు రంధ్రం పడివుండడాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా,  వేలూరు డివిజన్‌ డీఐజీ బాబు, ఎస్పీ రాజేష్‌ఖన్నా అక్కడకు చేరుకొని పరిశీలించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ చోరీ జరిగివుంటుందని ఒక అంచనాకు వచ్చారు. దొంగల జాడ కనుగొనేందుకు పోలీసు జాగిలాలను, వేలిముద్రల నిపుణులను రప్పించి సంఘట నాస్థలంలో ఆధారాలు సేకరించారు. దుకాణం పక్కనే ప్రహరీ గోడ వుండగా, దాని సమీపంలో కారు పార్కింగ్‌ ఉంది. ప్రహరీ గోడ సమీపంలో ఉన్న స్థలంలో భూమిలో కన్నం చేసి దాని వైపుగా ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. మేడ పైకి వెళ్లే ఏసీ పైపు పట్టుకొని పైఅంతస్తుకు వెళ్లారు. అక్కడ ఏసీ కోసం వేసినన లెథరింగ్‌ కోర్స్‌ పగులగొట్టి 3వ అంతస్తులోని వజ్రాల విభాగానికి వెళ్లారు. అక్కడ సీసీ టీవీ కెమెరాలపై స్ర్పే పిచికారీ చేయడంతో అవి పనిచేయలేదు. అనంతరం 3వ అంతస్తులో వజ్రాలు, నగలు, 2వ అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వెండి నగలు దోచుకొని వచ్చిన దారినే వెళ్లిపోయారు. బుధవారం వేకువజామున 1 నుంచి 3 గంటల్లోపు ఈ చోరీ జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ చోరీలో పదిమంది పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమాని స్తున్నారు. దుకాణంలో పనిచేసే ఉద్యోగులు లేదా మాజీ ఉద్యోగుల ప్రమేయం వుండి వుండచ్చని వారు భావిస్తున్నారు. అలాగే, దుకాణ సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. దుకాణంలో 63 కెమెరాలున్నాయి. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.



Updated Date - 2021-12-16T15:37:55+05:30 IST