శాసనమండలి రద్దు కాకుంటే...!

ABN , First Publish Date - 2020-02-20T10:32:36+05:30 IST

శాసనమండలి రద్దుకోసం తీర్మానం చేసి పంపించిన రాష్ట్ర ప్రభుత్వం... ఒకవేళ అది కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూస్తోందని సమాచారం. మండలి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన...

శాసనమండలి రద్దు కాకుంటే...!

  • ఆపరేషన్‌ ఆకర్షకు శ్రీకారం.. మండలిపై వైసీపీ ఎత్తుగడ 


అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): శాసనమండలి రద్దుకోసం తీర్మానం చేసి పంపించిన రాష్ట్ర ప్రభుత్వం... ఒకవేళ అది కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూస్తోందని సమాచారం. మండలి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన కూడా చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి మండలిలో వైసీపీకి మెజార్టీ లేనందున... కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది. సరిపడా సంఖ్యాబలం వస్తే అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచనపై ముందడుగు వేస్తోందని అంటున్నారు. 

Updated Date - 2020-02-20T10:32:36+05:30 IST