తేళ్ల రాయుడు

ABN , First Publish Date - 2022-08-16T05:52:14+05:30 IST

కోడుమూరు ఎర్రటి కొండపైన చిన్న గుడిలో కొండల రాయుడు రూపంలో వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు.

తేళ్ల రాయుడు
తేళ్లను పట్టుకొన్న చిన్నారులు

  1. శ్రావణమాసంలో వింత ఆచారం
  2. కొండపై భక్తుల కోలాహలం

కోడుమూరు, ఆగస్టు 15: కోడుమూరు ఎర్రటి కొండపైన చిన్న గుడిలో కొండల రాయుడు రూపంలో   వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ప్రతి ఏడాది శ్రావణ మాసం మూడో  సోమవారం కొండపై వింత ఆచారం జరుగుతుంది. సోమవారం  భక్తులు కాలినడకన కొండ్రాయి కొండకు చేరుకొని  రాళ్లను కదిపి   తేళ్లు కనిపిస్తాయి. వాటిని  చిన్న పిల్లలు సైతం  చేత్తో పట్టుకొని కొండల రాయడికి తేళ్లను నైవేద్యంగా సమర్పించి, ప్రత్యేక పూజలు  చేశారు.  కొన్ని దశాబ్దాలుగా కొండపై ఈ వింత ఆచారం కొనసాగుతోంది.  చేత్తో పట్టుకున్నా   తేళ్లు కరవకపోవడం కొండలరాయడి మహిమ అని భక్తులు అన్నారు. 

కొండపై అద్భుతం : లాస్యప్రియ.

మొదటిసారిగా కొండపైకి వచ్చాను. తేళ్లను పట్టుకొని స్వామివారికి సమర్పించాను.  తేళ్లు కరవకపోవడం వింత. ఇది స్వామి మహిమ. 

మహిమగల దేవుడు  : మణి.

  కొండలరాయడు రూపంలో వెలసిన వెంకటేశ్వరుడు మహిమగల దైవం.  కొండ మీద ఏ రాయిని కదిపినా తేళ్ల రూపంలో దేవుడు కనిపిస్తాడు. కనిపించిన తేళ్లను స్వామికి సమర్పించడం ఇక్కడి ఆచారం. 





Updated Date - 2022-08-16T05:52:14+05:30 IST