కారు దొంగలించిన దొంగ.. వెనుక సీట్లో పసివాడిని చూసి.. కొపంతో ఊగిపోతూ..

ABN , First Publish Date - 2021-01-24T10:36:34+05:30 IST

కారులో పిల్లాడిని వదిలేసినందుకు ఓ తల్లిని తిట్టిపోశాడో వ్యక్తి. అతను ఆమె కుటుంబ సభ్యుడో, రోడ్డుపైన వెళ్తున్న పెద్ద మనిషో అయితే ఓకే. అతనో దొంగ అయితే. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓరెగాన్‌లో జరిగింది. ఇక్కడి బీవర్టన్ ప్రాంతంలో

కారు దొంగలించిన దొంగ.. వెనుక సీట్లో పసివాడిని చూసి.. కొపంతో ఊగిపోతూ..

ఓరెగాన్: కారులో పిల్లాడిని వదిలేసినందుకు ఓ తల్లిని తిట్టిపోశాడో వ్యక్తి. అతను ఆమె కుటుంబ సభ్యుడో, రోడ్డుపైన వెళ్తున్న పెద్ద మనిషో అయితే ఓకే. అతనో దొంగ అయితే. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓరెగాన్‌లో జరిగింది. ఇక్కడి బీవర్టన్ ప్రాంతంలో హెండర్సన్ ఓ మహిళ కారులో బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఓ గ్రాసరీ షాపు కనిపించడంతో కారు ఆపింది. షాపు నుంచి 15 అడుగుల దూరంలో కారు ఆపి.. ఇంజన్ కూడా ఆఫ్ చేయకుండా షాపింగ్ చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో తన పసిబిడ్డను కారు వెనుక సీటులోనే వదిలేసింది. ఆమె షాపింగ్ చేస్తున్న సమయంలో ఓ దొంగ.. హెండర్సన్ కారు తీసుకొని పరారయ్యాడు. ఇలా కారు ఎవరో తీసుకెళ్లడం స్టోరో ఉద్యోగి కంటబడింది.


ఆ తర్వాత కాసేపటికి ఆ కారు తిరిగొచ్చింది. దానిలో నుంచి ఓ యువకుడు దిగి.. వెనుక సీట్లోని పసివాడిని ఎత్తుకొచ్చి హెండర్సన్ చేతిలో పెట్టాడు. ‘పిల్లాడిని అలా కారులో వదిలేస్తావా?’ అంటూ ఆమెను తిట్టిపోశాడు. ‘నీపైన పోలీసుకు కంప్లయింట్ చేస్తా’ అంటూ బెదిరించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆమె కారే తీసుకొని వెళ్లిపోయాడు. కారు దొంగతనం జరిగిన కొన్ని గంటల తర్వాత హెండర్సన్ కారు దొరికింది. కానీ ఆ దొంగ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ ఘటన గురించి మాట్లాడిన హెండర్సన్.. ‘‘ఈ ఘటన పిల్లలతో డ్రైవింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనే పాఠం నేర్పింది. నిజంగా పిల్లాడిని తిరిగివ్వడం కోసం ఆ దొంగ వెనక్కి రావడం అభినందించాల్సిన విషయమే’’ అని పేర్కొంది.

Updated Date - 2021-01-24T10:36:34+05:30 IST