4జీ సిగ్నల్స్‌ నోడ్‌ బాక్సుల దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-04T05:32:22+05:30 IST

4జీ సిగ్నల్స్‌ నోడ్‌ బాక్సుల దొంగల అరెస్ట్‌

4జీ సిగ్నల్స్‌ నోడ్‌ బాక్సుల దొంగల అరెస్ట్‌

రాయపర్తి, ఆగస్టు 3: 4జీ సిగ్నల్స్‌ నోడ్స్‌ దొంగతనాలకు పాల్పడుతు న్న ముఠా గుట్టును రాయపర్తి పోలీసులు రట్టు చేశారు. బుధవారం దొంగల ముఠా వివరాలను వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు మీడియా కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపర్తి మండల పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును ఆపి విచారణ చేశా రు. ఈ క్రమంలో దొంగలు ఆందోళన చెందుతూ కనిపించడంతో కారు ను స్వాధీనం చేసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. సెల్‌ టవర్‌లో అమర్చే 4 జీ సిగ్నల్‌ నోడల్‌ బాక్సులను దొంగి లించి హైదరాబాద్‌ కేంద్రంగా అమ్మకాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. ఇప్పటి వరకు ఈ ముఠా 21 సెల్‌ టవర్ల బాక్సులను దొంగిలించిన ట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఖమ్మం జిల్లాకు నిందితులు బానోతుసేవా, హలావత్‌ సోమ్లా, నునావత్‌ అశోక్‌, హైదరాబాద్‌కు చెం దిన అస్లంలను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మొహరం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వివ రించారు. త్వరలోనే నిందితున్ని పట్టుకోవడంతోపాటు వీరిని కోర్టు అను మతితో ఇంకా దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమావేశంలో వర్ధన్నపేట సీఐ సదన్‌ కుమార్‌, ఎస్‌ఐ బండారి రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T05:32:22+05:30 IST