విజయవాడలో చోరీలు.. చెడ్డీ గ్యాంగ్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-12-17T23:15:53+05:30 IST

గత నెల‌రోజులుగా విజయవాడ నగరంలో పలు చోరీలు జరిగాయని ఈ చోరీలు చేసింది గుజరాత్‌కు చెందిన గ్యాంగ్‌లు‌గా గుర్తించామని సీపీ, క్రాంతిరాణా టాటా తెలిపారు.

విజయవాడలో చోరీలు.. చెడ్డీ గ్యాంగ్‌ అరెస్టు

విజయవాడ: గత నెల‌రోజులుగా విజయవాడ నగరంలో పలు చోరీలు జరిగాయని ఈ చోరీలు చేసింది గుజరాత్‌కు చెందిన గ్యాంగ్‌లు‌గా గుర్తించామని సీపీ, క్రాంతిరాణా టాటా తెలిపారు. శుక్రవారం బెజవాడ పోలీసులుచెడ్డీ గ్యాంగ్‌ను మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈసందర్భంగా సీపీ, క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ.. నగరంలో చోరీలకు పాల్పడిన వారు గుల్బర్గ్ విలేజ్‌కు చెందిన నిందితులని చెప్పారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మడియా కాంజీ మేదా, సక్ర మందోడ్, కమలేష్ బాబేరియా‌లుగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ చోరీల్లో వెండి ఎక్కువగా దొంగతనం జరిగిందన్నారు. 


ప్రొఫెషనల్‌గా చోరీ చేసే నిందితులు మడియా కంజీ మేడా మీద 18, సక్రా మందోడ్ మీద 5, కమలేష్ బబేరియా మీద 3 కేసులు ఉన్నాయని మీడియాకు తెలిపారు. 2015 నుంచి కూడా వీరిపై కేసులున్నాయన్నారు. ఏపీ, తమిళనాడులలో కేసులున్నాయన్నారు. గత నెల 26న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌‌‌లో విజయవాడకు ఈ గ్యాంగులు వచ్చాయన్నారు. ఈనెల 4, 8 తేదీల్లో రెండు గ్యాంగులు వెళ్లిపోయాయన్నారు. కాలనీల్లో రాత్రి గస్తీ పెంచామన్నారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌‌లలో ఉన్నారని తెలిసి అక్కడకు టీంలను పంపామన్నారు. ఇతర నిందితుల కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయని  సీపీ, క్రాంతిరాణా టాటా మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-12-17T23:15:53+05:30 IST