Sep 29 2021 @ 01:24AM

రష్మీ రాకెట్‌ నుంచి చోరీ సాంగ్‌

బాలీవుడ్‌లో వరుస విజయాలతో రాకెట్‌లా దుసుకుపోతున్నారు పంజాబీ సుందరి తాప్సీ. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘రష్మీ రాకెట్‌’. ఈ సినిమా నుంచి ‘ఘనీ కూల్‌ చోరీ’ అంటూ సాగే సాంగ్‌ను తాప్సీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గుజరాత్‌లోని మారుమూల గ్రామానికి చెందిన రష్మీ అనే అథె ్లట్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లింగవివక్షను ఎదుర్కొంటూ ఆమె క్రీడాకారిణిగా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా ఉంటుంది.  జీ 5 ఓటీటీలో దసరా సందర్భంగా అక్టోబర్‌ 15 నుంచి ‘రష్మీ రాకెట్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి ఆకర్ష్‌ ఖురానా దర్శకుడు. రోనీ స్ర్కూవాలా, నేహా ఆనంద్‌, ఫ్రాంజల్‌ ఖందియా నిర్మించారు. 


Bollywoodమరిన్ని...