Abn logo
Jul 23 2021 @ 01:20AM

శివాలయంలో వినాయక విగ్రహం చోరీ

ఆలయంలో జాగిలాలతో సిబ్బంది తనిఖీలు

బ్రహ్మసముద్రం, జూలై 22: మండలంలోని ఎరిడికెర గ్రా మ శివాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు వినాయకుడి రాతి విగ్రహాన్ని దొంగలించారు. గురువారం శి వాలయానికి వెళ్లిన భక్తులు విగ్రహం చోరీకి గురైనట్లు గుర్తించారు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేశారు. కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఇనచార్జ్‌ ఎస్‌ ఐ సుధాకర్‌లు ఆలయాన్ని పరిశీలించారు. జాగిలాలతో సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు. గ్రామస్థులతో వివరాలు సేక రించి పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించి  చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇతర ప్రాంతాలకు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.