సుంకెట్‌లో నాలుగు ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2022-05-16T05:42:41+05:30 IST

మండలంలోని సుంకెట్‌ గ్రామంలో శనివారం అర్ధ రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా నాలుగు ఇళ్లల్లో దొంగలు దోపిడీ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాధితులు మే డపై నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువలో ఉన్న నగదు, బంగారాన్ని దొంగిలించారు. ఈ సంఘటనలో కడారి సామె ల్‌ వారం రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి వచ్చారని, అతడికి చెందిన రూ.5 వేలు బెహరెన్స్‌ కరెన్సీ, రూ.45 వేలు దొంగిలించారు. దాసరి శారద తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న ఐదు తులాల బంగారం, గంగాధర్‌ ఇం ట్లో వెండి అభరణాలు, శ్రీరాం మారుతి ఇంట్లో 3 తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ముత్యంరాజ్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దొంగతనానికి సం బంధించిన వివరాలు క్లూస్‌టీం ద్వారా సేకరించామని తెలిపారు. సీసీ కె మెరాలు, ఇతర ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలోనే దొంగల ను పట్టుకుంటామని అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ గోవర్ధన్‌, క్లూస్‌టీం సభ

సుంకెట్‌లో నాలుగు ఇళ్లల్లో చోరీ

మోర్తాడ్‌, మే15: మండలంలోని సుంకెట్‌ గ్రామంలో శనివారం అర్ధ రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా నాలుగు ఇళ్లల్లో దొంగలు దోపిడీ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాధితులు మే డపై నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువలో ఉన్న నగదు, బంగారాన్ని దొంగిలించారు. ఈ సంఘటనలో కడారి సామె ల్‌ వారం రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి వచ్చారని, అతడికి చెందిన రూ.5 వేలు బెహరెన్స్‌ కరెన్సీ, రూ.45 వేలు దొంగిలించారు. దాసరి శారద తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న ఐదు తులాల బంగారం, గంగాధర్‌ ఇం ట్లో వెండి అభరణాలు, శ్రీరాం మారుతి ఇంట్లో 3 తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ముత్యంరాజ్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దొంగతనానికి సం బంధించిన వివరాలు క్లూస్‌టీం ద్వారా సేకరించామని తెలిపారు. సీసీ కె మెరాలు, ఇతర ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలోనే దొంగల ను పట్టుకుంటామని అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ గోవర్ధన్‌, క్లూస్‌టీం సభ్యులు ఉన్నారు. ఈ సంఘటన గ్రామస్థులను కలవరపరిచింది. 

Updated Date - 2022-05-16T05:42:41+05:30 IST