Abn logo
May 18 2021 @ 11:03AM

దుండిగల్ పీఎస్ పరిధిలో రెండు ఇళ్లల్లో చోరీ

జీడిమెట్ల: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారెగూడెం గ్రామంలో రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. మరో మూడు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నించారు. అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి, రెండు సీసీ కెమెరాలు ద్వంసం చేశారు. దొంగతనం చేయడానికి ఐదుగురు వచ్చినట్లు  సీసీ ఫుటేజీ ద్వారా ఇంటి యజమాని సంతోష్ గమనించారు. రెండు ఇళ్లలో నగలు, నగదు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement