Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుమ్మలపల్లిలో చోరీ

చండూరు, అక్టోబరు 13: మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో  చోరీ జరిగింది. ట్రైనీ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి కురుపాటి సువర్ణ  సువర్ణ తన అమ్మమ్మ చనిపోగా దహన స్కారాలకు  మంగళవారం ఉదయం వేరే  ఊరు వెళ్లింది. అదేరోజు రాత్రి ఇంటికి రాగా కొత్త తాళం వేసి ఉంది. దీంతో ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఇల్లంతా బీరువాలోని వస్తువులతో  చిందర వందరగా కనిపించింది. దీంతో అన్ని వస్తువులనూ పరిశీలించగా, అందులో నుంచి అరతులం దిద్దులు, అర తులం మాటీలు, 20 తులాల వెండి, 40 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Advertisement
Advertisement