Advertisement
Advertisement
Abn logo
Advertisement

నంబులపూలకుంటలో చోరీ

నంబులపూలకుంట, డిసెంబరు 8 : స్థానిక పోలీసుస్టేషనకు కూతవేటు దూరంలో ఉన్న టీస్టాల్‌ రవి ఇంటిలోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు మంగళవారం రాత్రి చోరీకి గురయ్యాయి. బుధవారం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రిలో బంధువుల వివాహానికి రవి తన కుటుంబ సభ్యులతో మంగళవారం వెళ్లాడు. బుధవారం సాయంత్రం ఇంటికి రా గా, ఇంటి తాళాలు పగులకొట్టి దుండగులు చోరీకి పాల్పడినట్లు గు ర్తించారు. బీరువాలోని రూ. 1.20 లక్షలు నగదు, మూడు జతల బంగారు కమ్మలు, 20 గ్రాములు వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించాడు. అప్పులు తీర్చడానికి నల్లచెరువులో తన భూమిని విక్రయించిన డబ్బులను ఇంట్లో పెట్టి వెళ్లగా చోరీ అయినట్లు రవి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement
Advertisement