ఐసీఎల్‌ క్వార్టర్స్‌లో చోరీ

ABN , First Publish Date - 2021-04-13T05:28:10+05:30 IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, థార్‌ జిల్లా, కుక్షి మండలంలోని నర్వాలి గ్రామానికి చెందిన నలుగురు ముఠా సభ్యులు జిల్లాలో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఆపై తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకునేవారు.

ఐసీఎల్‌ క్వార్టర్స్‌లో చోరీ
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ

దొంగ అరెస్టు ఫ పరారీలో మరో ముగ్గురు

రెండు బంగారు ఉంగరాలు, రూ.1200 స్వాధీనం

కడప(క్రైం), ఏప్రిల్‌ 12: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, థార్‌ జిల్లా, కుక్షి మండలంలోని నర్వాలి గ్రామానికి చెందిన నలుగురు ముఠా సభ్యులు జిల్లాలో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఆపై తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకునేవారు. ఈ క్రమంలో రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న దొంగల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ ఎం.దేవప్రసాద్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో కడప డీఎస్పీ బి.సునీల్‌, యర్రగుంట్ల సీఐ సదాశివయ్యతో కలిసి ఓఎస్డీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. యర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఐసీఎల్‌ క్వార్టర్స్‌లో ఉన్న షేక్‌ అన్వర్‌బాషా, సూర్యనారాయణరెడ్డి ఇళ్లల్లో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి సుమారు రూ.17.20 లక్షలు విలువ చేసే బంగారాన్ని దొంగలించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పీఎ్‌సలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీఐ సదాశివయ్యకు వచ్చిన సమాచారం మేరకు ముద్దనూరు - కడప మెయిన్‌రోడ్డులో అనుమానంగా తిరుగుతున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం థార్‌ జిల్లా ఒగోలి గ్రామానికి చెందిన రామ్‌సింగ్‌ మొహద్దాను అదుపులోకి తీసుకుని విచారించడంతో అతని వద్ద రెండు ఉంగరాలు (12 గ్రాములు), రూ.1200ను సీజ్‌ చేశామని, నిందితుడు కలమల్ల, కొలిమిగుండ్లతో పాటు చిలంకూరులోని ఐసీఎల్‌ క్వార్టర్స్‌లో జరిగిన దొంగతనాలు ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని స్నేహితులైన ధనియాసింగ్‌, జువాల్‌సింగ్‌, నాన్కాలు కలిసి దొంగతనాలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. అలాగే నలుగురు నిందితులు గత ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలోని అలా్ట్ర సిమెంటు ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. పరారైన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని,మధ్యప్రదేశ్‌ నుంచి నలుగురు బ్యాచ్‌లుగా వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతుండేవారని తెలిపారు. త్వరలో మరో ముగ్గురిని పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-04-13T05:28:10+05:30 IST