నమ్మకంగా ఉంటూ ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2020-09-25T07:27:36+05:30 IST

నమ్మకంగా ఉంటూ ఇంట్లోని నగదు, నగలను దొంగిలించాడు ఓ ప్రబుద్ధుడు. స్నేహి తుడితో కలిసి ఓ ప్రైవేటు ఫైనాన్స్‌

నమ్మకంగా ఉంటూ ఇంట్లో చోరీ

పంజాగుట్ట, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): నమ్మకంగా ఉంటూ ఇంట్లోని నగదు, నగలను దొంగిలించాడు ఓ ప్రబుద్ధుడు. స్నేహి తుడితో కలిసి ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో వాటిని కుదువపెట్టాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గురువారం నిందితుడితోపాటు అతడి కి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట డీఐ నాగయ్య తెలిపారు. నాగార్జున నగర్‌కాలనీ బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో నివా సం ఉంటున్న ప్రదీప్‌కుమార్‌ తండ్రి కిష్టయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా రు. అతడికి సేవలు చేయడానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం, కర్లపాడు గ్రామా నికి చెందిన గోపయ్య (31)ను గతనెల 26న నియమించారు.


ఈ నెల 19 వరకు కిష్టయ్యకు సేవలు చేశాడు. ఈ నెల 19న ఉదయం వ్యర్థాలు బయటపడేస్తానంటూ గోపయ్య బయటకెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన ప్రదీప్‌కు మార్‌ ఇంట్లో తనిఖీ చేయగా 5తులాల బంగా రు గొలుసు, 10 గ్రాముల ఉంగరం, చెవిరింగులు, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో ఆయన అదే రోజు పంజాగుట్ట పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో గోపయ్య సోమాజిగూడలో ఉన్న ట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా గుంటూరు జిల్లా మాచవరం గ్రా మానికి చెందిన కోటేశ్వరరావు అలియాస్‌ కోటి సహకారంతో పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఫైనా న్స్‌ సంస్థలో నగలు కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తెలిపాడు. అతనిచ్చిన సమాచా రంతో కుదువపెట్టిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఐ నాగయ్య తెలిపారు.  

Updated Date - 2020-09-25T07:27:36+05:30 IST