Shamshabad : శంషాబాద్‌లో దొంగలు కలకలం సృష్టించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌బీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. సిద్దేశ్వర అనే వ్యక్తి ఇంట్లో 12 తులాల బంగారంతో పాటు కొంత నగదును దొంగలు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.